కొన్ని గొడవలు ఎంతటి ఉగ్ర రూపాన్ని దాల్చుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు లేదు.. చిన్న ఘర్షణగా మొదలైన కొన్ని మాటా మాటా పెరిగి చివరికి పెద్ద గొడవ అవుతాయి. అవి కొన్ని ప్రాణాలు పోయే వరకూ ఆగవు. కూరగాయల దగ్గర జరిగే గొడవల గురించి అందరికి తెలిసిందే.. అలాంటిది ఇప్పుడు చికెన్ షాపు దగ్గర ఒక గొడవ జరిగింది. చికెన్ లో బాగాలేదని షాపు యజమాని తో కొందరు వ్యక్తులు గొడవకు దిగారు. దాంతో గొడవ కాస్త పెరిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి దారుణంగా తయారైంది. అది కాస్త కర్రలతో దాడి చేసుకొనే వరకూ వెళ్ళింది . అంతటితో గొడవ ఆగలేదు..


ఆ గొడవలొ యాసిడ్ కూడా ప్రత్యక్ష మైంది. యాసిడ్ పోసుకొని గొడవలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురికి గాయాలు అయ్యాయి. చికెన్ కోసం ఇంత పెద్ద గొడవ జరుగుతోందని ఎవరు కూడా ఊహించలేదు. వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్‌ ప్రాంతం చికెన్ గొడవతో రణరంగాన్ని తలపించింది.. నగరంలో హరీష్ అనే వ్యక్తి చికెన్ షాప్ ను నిర్వహిస్తున్నారు. గత కొన్నెల్లుగా ఆయన మంచి చికెన్ ను అందిస్తూ వస్తున్నారు.


అందరికి నమ్మకంగా వుండేవాడు. ఎంతో మంది చిరు వ్యాపారులు కూడా ఇతని వద్ద నుంచి చికెన్ ను తీసుకొనేవారు.హరీష్‌కు మద్దతుగా కొందరు, గొడవకు దిగిన చిరువ్యాపారులకు మద్దతుగా కొందరు అక్కడికి చేరుకున్నారు. ఇరువురు కర్రలతో దాడులకు దిగారు. అదే సమయంలో సదరు చిరు వ్యాపారులు యాసిడ్‌తో దాడి చేయడంతో 10 మందికి గాయాలయ్యాయి.. వారందరిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా చికెన్ కోసం ఇలాంటి గొడవ జరగడం తో ఆ ప్రాంతం అంతా రణరంగంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: