సాధారణంగా యువతీ యువకులు పెద్దలను ఎదిరించి ఎక్కడికైనా పారిపోయి రహస్యంగా పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎన్నో ప్రేమ జంటలు తమ ప్రేమను గెలిపించుకోవడానికి పెద్దలను ఎదిరించి ఇలాగే చేస్తూ ఉన్నారు. ఇక రహస్యంగా పెళ్లి చేసుకోవడమే కాదు ఎవరికి తెలియకుండా రహస్యంగా కాపురం కూడా పెట్టేస్తున్నారు. ఇక మరికొన్ని ఘటనల్లో పెద్దలు బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే ఇక వధువు లేదా వరుడు పెళ్ళికి ముందు రోజే ఇక ఇంట్లో నుంచి పారిపోయి  తల్లిదండ్రులకు షాక్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటాడు.


 ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయాయి. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం ఇప్పటివరకు ఎవరూ కూడా కని విని ఎరుగనిది అని చెప్పాలి. అంతే కాదు సినిమాల్లో కూడా ఇంత క్రియేటివిటీ లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది ఈ ఘటన గురించి తెలిసిన తరువాత. ఇంతకీ ఏం జరిగింది అంటే ఇద్దరు యువతీయువకులకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలోనే వధువు లేచిపోయింది.. ఇందులో కొత్త ఉంది అని అనుకుంటున్నారు కదా. వధువు లేచిపోయింది ఎవరితోనో కాదు మరి కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న వరుడుతో.


 అదేంటి మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగబోతుంది. ఇక ఇప్పుడు అతనితో పారిపోవడానికి గల కారణం ఏంటి అని అనుకుంటున్నారు కదా.. ఇంతకీ ఏం జరిగిందంటే.. వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న సమయంలో కాబోయే వరుడితో యువతి లేచిపోయింది. పెద్దలు ఫిక్స్ చేసిన ముహూర్తం కంటే ముందు అతనితో తాళి కట్టించుకుంది. ఏడడుగులు కూడా వేసింది. కాబోయే భర్తకు తన చెల్లి ప్రపోజ్ చేయబోతుంది అని తెలుసుకొన్న యువతి ఇలా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. ఇక ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: