రాజధాని ప్రాంతంలో పేదలకు ఇల్లు అనే విషయంలో పైకి మంచిగా చూపిస్తూ, తెరవనక అరాచకమైన కత్తుల వ్యూహాన్ని నడిపినట్లుగా తెలుస్తుంది. అదేంటంటే సి.ఆర్.డి.ఏ నిబంధనలో కేవలం 5శాతం అని మాత్రమే ఉంది కాబట్టి ఇవ్వడానికి వీలు లేదని. చట్టం అలా ఉంది కాబట్టి అంతే అని కోర్టు కూడా అంటుంది. చట్టం అలా ఎలా ఉంటుందని కోర్టు అడగలేదు, కోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అడగడం అవలేదు. ఎందుకంటే గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే చేసింది కాబట్టి.


కాబట్టి అప్పుడు ఇచ్చిన జీవోని కొట్టిపడేశారు. బెజవాడ, దుగ్గిరాల, కాకానికి చెందిన పేదలని, 50వేల మందిని అక్కడ ఉండటానికి కుదరదు అన్నారు. భారతదేశానికి చెందిన ఏ రాజధాని లోనైనా సరే పేదలు 5శాతానికి మించి ఉండకూడదు అనేది, బయట పేదలకు స్థానం లేదు అనేది లేదు. బెజవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ఈ ప్రాంతమంతా రాజధాని  పరిధిలోనిదని ఒక పక్కన చెప్తూ, సి.ఆర్.డి.ఏ పరిధిలోనిదని  మరో పక్కన  చెబుతూ, రెండో పక్కన ఈ 29గ్రామాల్లోకి వేరే పేదలు రాకూడదన్నారు కూడా.


అక్కడ భూములు కొనాలన్నా అంతకుముందున్న భూములు ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలి లేదా ప్రభుత్వం దగ్గర తీసుకోవాలి. అంతకుమించి ఆప్షన్ ఉండదు. ప్రభుత్వానికి సంబంధించినవి ఎవరికైనా ఇస్తే వాళ్ళకి ఎందుకు ఇచ్చావు అని అదొక గొడవ. అట్లాగే తలకు ఒక సెంటు భూమి ఇస్తానన్న పేదలు ఉండడానికి వీలు లేదనేది ఒకటి.


ఇప్పుడు తాజాగా దానిపైన ఆర్ ఫైల్ జోన్ అంటూ సి.ఆర్.డి.ఏ నిబంధనలు  జోడించి కొత్త చట్టం పెట్టారు. ఆ చట్టం పైన  ప్రజాభిప్రాయాన్ని తీసుకోలేదని మళ్లీ సవాల్ చేశారు కోర్టుకి. ఇప్పుడు తాజాగా 50వేల పేదలకు ఇల్లు ఇచ్చేటువంటి ఆర్ ఫైల్ జోన్ ని అనౌన్స్ చేశారు. మళ్లీ దీనిని కోర్టులో అడ్డుకుంటున్నారు వీళ్ళు. అమరావతి అందరి రాజధానిగా ఉండాలంటే కోర్టులో దీనిని అడ్డుకోకూడదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: