విద్య అనేది ఉచితం. దాన్ని డబ్బులకు అమ్మకూడదు. ఇది మన పూర్వకాలం నుంచి కూడా వినిపిస్తున్న మాట. కానీ ఈ కాలంలో ఆ విద్యని కూడా అమ్మేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. మెడికల్  కాలేజీల్లో ట్యూషన్  ఫీజును రూ. 24 లక్షలకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఇంకా ట్యూషన్ ఫీజు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ఎడ్యుకేషన్  అనేది లాభం పొందే వ్యాపారం కాదని భారతదేశ ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది.జడ్జిలు అయిన ఎంఆర్ షా, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం ఏకపక్షంగా ఫీజును పెంచడం ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (అడ్మిషన్ల నియంత్రణ, క్యాపిటేషన్ ఫీజు నిషేధం) చట్టం, 1983, అలాగే రూల్స్ 2006 నిబంధనలకు విరుద్ధమని పేర్కొనడం జరిగింది.“ఏడాదికి ఫీజును రూ. 24 లక్షలకు పెంచడం అంటే, ఇంతకు ముందు నిర్ణయించిన ఫీజు కంటే ఏడు రెట్లు చాలా ఎక్కువ చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. విద్య అనేది లాభాన్ని ఆర్జించే వ్యాపారం కాదు.


ట్యూషన్ ఫీజు అనేది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి” అని తన తీర్పులో పేర్కొంది. “ట్యూషన్ ఫీజులను నిర్ణయించేటప్పుడు లేదా సమీక్షించేటప్పుడు పైన పేర్కొన్న అన్ని అంశాలను కూడా AFRC (అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్ స్పష్టం చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ కి చెందిన నారాయణ మెడికల్ కాలేజీ రూ. 5 లక్షల వ్యయాన్ని ఆరు వారాల వ్యవధిలో కోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు విధించడం జరిగింది. ఇంకా అలాగే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మెడికల్ కాలేజీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కొట్టివేస్తూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 2006 నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే, కమిటీ సిఫార్సులు లేదా నివేదిక లేకుండా ఫీజును పెంచడం లేదా ఫిక్స్ చేయడం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొనడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: