
రెండేళ్ల నిర్బంధం తర్వాత ఇప్పుడు సహజీవనం అనే మాట వచ్చింది ..అదేదో కరోనా మొదలైన కొత్తలోనే ఆ పద్ధతి ఉంటే వాళ్ళల్లో కనీసం హెర్డ్ ఇమ్యూనిటీ ఉండేది. అప్పుడు ఎన్ని వేవ్ లు వచ్చినా తట్టుకునే శక్తి ఉండేది. మానసికంగా ప్రిపేర్ అయ్యేవారు. లెక్కల ప్రకారం చైనాలో 37 నుంచి 40 కోట్ల మంది వరకు కరోనా సోకింది కానీ అందరూ చనిపోవడం లేదు. చైనాలో వ్యాక్సిన్ వేయించుకున్న వారు కేవలం 45 శాతం నుండి 50 శాతం మంది వరకే . అది కూడా వృద్ధులలోనే ఆ45 శాతం మంది. వారు వ్యాక్సిన్ ని కొనుక్కున్నవారు. మిగిలిన వారైతే డబ్బు పెట్టి కొనడం ఇష్టం లేక వ్యాక్సిన్ వేయించుకోలేదు.
దానికి కారణం లేకపోలేదు. కరోనా వచ్చిన కొత్తలో అయితే ఆ భయంతో అందరూ వ్యాక్సిన్ వేయించుకునే వారేమో కానీ ఆ తర్వాత ప్రపంచ దేశాలు కరోనాని నియంత్రిస్తున్నాం అని చెప్పేసరికి ఖర్చుపెట్టి కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోయినా పర్వాలేదు అని చాలామంది జనం అనుకున్నారు. దాంతో హెర్డ్ ఇమ్యూనిటీ లేకపోవడంతో తిరిగి కరోనాకి గురి అవ్వడం జరిగింది. చనిపోయిన వారు చైనాలో 10 నుంచి 20-30లక్షల వరకు ఉంటున్నారు. కానీ వారి మరణానికి కారణమైతే నిమోనియా, గుండె నొప్పులు అంటూ అక్కడ చూపిస్తున్నారు. నిజమైన కరోనాతో చనిపోయిన వారు వెయ్యి మంది వరకు కూడా లేరని తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తున్నారు .