
ప్రభుత్వం గత ఏడాది కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ, పీఆర్సీ కమిటీ ఏర్పాటు ఇంతవరకు జరగలేదని విద్యాసాగర్ గుర్తు చేశారు. ఉద్యోగులకు మూడు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డుల అమలు సక్రమంగా జరగడం లేదని, ఉద్యోగులు చెల్లించిన డబ్బులను ఈహెచ్ఎస్‌కు జమ చేయాలని కోరారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
పబ్లిక్ సెక్టార్, గురుకుల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని ఏపీఎన్జీజీవో సమావేశంలో చర్చించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను పక్క మండలాలకు బదిలీ చేసే నిర్ణయాన్ని ఉపసంహరించాలని కోరారు. అలాగే, గ్రామ సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ప్రభుత్వం త్వరలో చర్చించి పరిష్కారం చూపాలని రమణ నొక్కి చెప్పారు.
కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని విద్యాసాగర్ పేర్కొన్నారు. అయితే, మిగిలిన బకాయిలు, పీఆర్సీ కమిటీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీఎన్జీజీవో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమం కోసం సమన్వయంతో ముందుకు సాగుతామని రమణ తెలిపారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు