
ముఖ్యంగా స్త్రీలలో, 30 ఏళ్లు దాటిన తర్వాత సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే ఛాన్స్ ఉంటుంది. గర్భం దాల్చడం కష్టం కావడంతో పాటు గర్భధారణ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల భాగస్వామి వ్యక్తిత్వాలు, జీవనశైలిలో తేడాలు ఉండటం వలన అభిప్రాయభేదాలు తలెత్తుతాయని చెప్పవచ్చు. భాగస్వామికి సంబంధించిన అలవాట్లు, ప్రవర్తన నచ్చకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి.
పెళ్లి ఆలస్యం అవుతుందనే ఒత్తిడి, మరియు సరైన భాగస్వామి దొరకడం లేదా భాగస్వామి ఎంపికలో తప్పులు చేయడం వంటివి కొన్ని సందర్భాల్లో మానసిక సమస్యలకు దారి తీస్తాయి. కొంతమందికి, పెళ్లి చేసుకోవడానికి భయం లేదా స్వేచ్ఛ కోల్పోతామనే భయం కూడా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేట్ గా పెళ్లి చేసుకుంటే కొత్త జీవితంలో సర్దుకుపోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
ఆర్థిక సమస్యలు లేదా కెరీర్ పరమైన ఆటంకాలు కూడా కొంతమంది జీవితాలలో పెళ్లి ఆలస్యానికి కారణమవుతాయి. ప్రతి ఒక్కరి జీవితం వేరుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే నష్టాలు వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవాలని ఫీలయ్యే వాళ్ళు సంతానోత్పత్తి, మానసిక ఆరోగ్యం, మరియు భాగస్వామితో సంబంధాల పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోవడం ముఖ్యం.