హీరోయిన్లకు అందం ఉంటేనే అవకాశాలు రావు.. దాంతోపాటు టాలెంట్ కూడా ముఖ్యమే. గ్లామర్ తో రాణించిన హీరోయన్లు కొందరుంటే.. టాలెంట్ తో రాణించిన వారు మరికొందరు ఉన్నారు. గ్లామర్, నటనతో ఆకట్టున్నవారూ చాలా మంది ఉన్నారు. ఈ జనరేషన్ లో ఈ మూడో కేటగిరీలోకి వచ్చే హీరోయిన్ల లిస్టులో సాయి పల్లవి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. వచ్చిన అవకాశం కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది. అందుకే ఆమె చేసిన సినిమాల లిస్టు తక్కువే. ప్రస్తుతం ఆమె తెలుగులో మరో ప్రాజెక్టు రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది.


రీసెంట్ గా సాయి పల్లవి చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిందనే వార్తలు వచ్చాయి. లూసిఫర్ రీమేక్ లో చిరంజీవికి చెల్లెలి పాత్రకు సాయి పల్లవిని సంప్రదించారని వార్తలు వచ్చాయి. అయ్యప్పణుం కోషియమ్ రీమేక్ లో పవన్ కు జోడీగా చేయడం కోసం సంప్రదించినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ రెండు ఆఫర్లను ఆమె తిరస్కరించినట్టు వార్తలు ఇండస్ట్రీలో రౌండ్ అయ్యాయి. ఇప్పుడు మరో తెలుగు సినిమాను కూడా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. వరుస సక్సెస్ లు ఇస్తున్న యువ దర్శకుడి సినిమాకు ఆమెను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్ ను కూడా ఆమె రిజెక్ట్ చేసిందని సమాచారం.


ప్రస్తుతానికి ఈ వార్తలన్నీ గాసిప్స్ గా రౌండ్ అవుతున్నాయి. వీటిపై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇదే నిజమైతే ఆమె భారీ ఆఫర్లను తిరస్కరించినట్టే. పాత్రను బట్టి సినిమాలు చేసే సాయిపల్లవికి ఈ నిర్ణయాలు డేరింగ్ డెసిషన్లు అనే చెప్పాలి. ప్రస్తుతం నాగ చైతన్యతో లవ్ స్టోరీ, రానాతో విరాటపర్వం సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సాయి పల్లవి తర్వాత చేయబోయే సినిమాలేంటో ఆమె చెప్పాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: