
ఎంటర్టెయిన్మెంట్ రంగం గ్లామర్ తో గ్లిట్టర్ అవుతూ ధగధగలాడుతూ ఉండే రంగుల ప్రపంచం. దూరం నుంచి చూసే వాళ్ళకు “వావ్!” అనిపిస్తుంది. ఈ గ్లామర్ ప్రపంచంలో గ్రామర్ కు విలువెక్కడిది. ఇందులో సినీ రంగం అనే వైకుంఠపాళిలో పైకెక్కించే నిచ్చెనలెన్నున్నాయో! అందుకు మించి పడేసే పాములూ! ఉంటాయి. ఇక్కడ ఉన్నత సాయికి చేరుకోవాలంటే ముందుగా పాముల్ని తప్పించుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళాలి, నిచ్చెనలను అంది పుచ్చుకోవాలి.
ఇక్కడ యువకులకు, యువతులకు వేర్వేరు సమస్యలు. ఎవరిగోల వారిది. యువకులకు కులం, ప్రాంతం, గాడ్-ఫాదర్లు లాంటివి ఉండటం మాత్రమే కాదు, అవసరమైన చోట్ల డబ్బు విరజిమ్మటం - సందర్భాన్ని బట్టి గ్లామర్ ఎర వెయ్యటం - ఒక సమస్య.
అయితే యువతుల సమస్య “కేస్టింగ్-కౌచ్” అంటే ఒక రకమైన ‘క్విడ్-ప్రొక్వొ’ ఇక్కడ అందం రకంగా పెట్టుబడే. నీకు ఒకటి కావాలంటే నాకు ఒకటి ఇవ్వాలి - బార్టర్ సిష్టం. నిన్ను హీరోయిన్ గా తీసుకోవాలంటే నాకు పడక షేర్ చెయాలి అనేదే “కమిట్మెంట్” అందాల భామల జీవితాల గురించి కమిట్మెంట్ గురించి నడివీదుల్లో పంచాయతీలు పెట్టి మరీ చర్చోపచర్చలు జరిపారు ఈ మద్య.
ఈ సంధర్భంగా జనంలో వెండితెరపై అందాలను ఒలక బోసే హాట్ భామలు తెర వెనుక వ్యవహారాలు ఎలా ఉంటాయి? అనేదానికి టాలీవుడ్ యువ నటీమణి ఒకరు ఆ రహస్యం వలువలూడదీసుకొని మరీ బట్టబయలు చేసింది. ఆ సంఘటన మేడి పండులా నిగనిగలాడే సినీ రంగం పొట్ట విప్పి చూపించింది.
దీంతో సినీ పరిశ్రమలో అవకాశాలు రావాలంటే అమ్మాయిలు తప్పకుండా పడక సుఖం అందించాల్సిందేనా? లాంటి అనేక ప్రశ్నలు పెల్లుభికాయి. ఆ సమయంలో పెద్ద సంఖ్యంలో నటీమణులు తన వేదనలను ప్రపంచం ముందు బయట పెట్టారు
ఇదే వ్యవహారంపై తాజాగా ప్రముఖ హీరోయిన్ ఇలియానా డి’ క్రూస్ కాస్టింగ్ కౌచ్ గురించి ఇలా స్పందించింది.
“సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఉందని అయితే ఈ విషయం పై ఏ ఒక్కరూ పారదర్శకంగా మాట్లాడరని, అలా ఎందుకు మాట్లాడరో? కూడా విడమరిసి చెప్పింది.
సినీ ప్రపంచలో పడక సుఖం లాంటి అవసరాలు తీర్చటానికి వేధింపులకు గురైన వారు దాన్ని బయటపెడితే, ఆ తరవాత వారి కెరీర్ అంతమై పోతుందేమోనని చాలా మంది భయపడతారు. సర్వస్వం కోల్పోయి ఆపై బ్రతుకు బజార్న వేసుకోవటం ఎవరి కిష్టం అన్నట్లు చెప్పి చెప్పనట్లు చెప్పేశారు
కొన్నాళ్ళ క్రితం “ఓ జూనియర్ హీరోయిన్ కు పెద్ద నిర్మాతల నుండి వేధింపులు రావడంతో, ఆమె దీన్ని ఎలా ఎదుర్కోవాలి?” అంటూ నన్ను సలహా అడిగింది. అయితే తనకు “ఈ విషయంలో నేను సలహా ఇవ్వలేనని చెప్పానని” – ఎందుకంటే, ఆమె సమస్య గురించి ఆమెనే స్వయంగా నిర్ణయం తీసుకోవాలి. అది ఆమె స్వంతం, ఆమె భవిష్యత్తు. ఆమె జీవితంపై ప్రభావం చూపే అంశం. కాబట్టి దానిపై మరో వ్యక్తి ప్రబావం కాని, ఒత్తిడి కాని తగదని తాను భావించానని చెప్పింది ఇలియానా. కర్త కర్మ క్రియ తానె అయిన చోట నిర్ణయం కూడా తనే ఆలొచించి సమస్య పరిష్కరించుకోవాలి.
అంతే కాకుండా మన దేశంలో సినిమా నటుల్ని పూజిస్తారని, అయితే అంతలా పూజింపబడే వారు కూడా తెరవెనుక ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో? ముఖ్యంగా హీరోయిన్లు, నటీమణులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో? తెలియజేయడానికి చాలా మంది నటీనటులు ఐఖమత్యంతో ఒకటై సమస్య పరిష్కారానికి సరైన మార్గం, అలాగే సమస్యలను ఎదుర్కొనే సామర్ధ్యం పెంపొందించుకోవాలని ఇల్లిబేబి చెప్పుకొచ్చింది. ఇలియానా ఈ వ్యాఖ్య మరోసారి కాటింగ్ కౌచ్ విషయంతో సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యింది.