
జాన్వి కపూర్ పసుపు కలర్ చీరలో తెలుపు కలర్ జాకెట్ వేసుకుని ఈ వీడియో ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ పాటను చూసిన ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.. ఇక జాన్వికపూర్ ఎప్పుడు మోడ్రన్ డ్రెస్ లనే వేసుకుంటూ అలరిస్తూ ఉండే ఈమె తాజాగా చీరలో తన అందాన్ని అంత చూపిస్తు.. ఈ వీడియోకి హైలెట్గా నిలిచింది. ఇక తన హెయిర్ స్టైల్ తో జాన్వీకపూర్ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తోంది. ఇక తను వేసే ప్రతి ఒక్క స్టెప్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక తన అందాన్ని కెమెరాలో బంధించారు. ఇక ఈమె అంతలా అందంగా కనిపించడానికి కారణం ఎవరంటే.. ఫేమస్ ఫ్యాషనిస్ట్ మనీష్ మల్హోత్ర ఈ శారీ ని డిజైన్ చేశారట.
జాన్వికపూర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్లో ఒక సినిమాలో నటిస్తోంది ఇక మరొక సారి కూడా అదే బ్యానర్ పై ఈ రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. తాజాగా నటిస్తున్న గుడ్ లక్ జెర్రీ అని మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక దీనితో పాటే మిలీ అనే సినిమాలొ కూడా నటిస్తున్నది ఈ ముద్దుగుమ్మ. ఇక దక్షిణాది ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టడానికి చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది జాన్వికపూర్.