రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ , మారుతీ దర్శకత్వం లో తెరకెక్కు తున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించి న మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ రోజు నుండి ఈ సినిమా కు సంబంధించిన రెండవ షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది . ఈ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది . ఈ రెండవ షెడ్యూల్ షూటింగ్ కోసం ప్రభాస్ వారం రోజులను కేటాయించినట్లు తెలుస్తోంది .

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని దర్శకుడు మారుతి అతీంద్రియ శక్తుల కథాంశంతో రూపొందిస్తున్నట్లు సమాచారం . అలాగే ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను ఈ మూవీ యూనిట్ పరిశీలి స్తున్నట్లు ఒక వార్త చాలా రోజులుగా వైరల్ అవుతుం ది. ఈ మూవీ లో ప్రభాస్ డ్యూయల్ రోల్.లో కనిపించబోతున్నట్లు , ఈ మూవీ యొక్క షూటింగ్ ఎక్కువ శాతం ఒక సెట్ లోనే జరగబో తున్నట్లు కూడా ఈ మూవీ పై వార్తలు వచ్చాయి . ఈ మూవీ లో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నట్లు తెలుస్తోంది . అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రిద్ధీ కుమార్ లను సెలెక్ట్ చేసుకున్నారు . అలాగే సంజయ్ దత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం .

మరింత సమాచారం తెలుసుకోండి: