స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడుగా రాజు గారి గది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అశ్విన్ బాబు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అశ్విన్ కు మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది.

ఇక ఈ సినిమా తరువాత అశ్విన్ మరో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు కానీ, అది జరగడం లేదు. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని కసితో ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ మధ్యకాలంలో అయితే హర్రర్ .. లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువగా హిట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అశ్విన్, నందితా శ్వేత జంటగా నటిస్తున్న చిత్రం హిడింబ. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా హిడింబ ట్రైలర్ ను మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. 1908, బంగాళాఖాతం సముద్ర తీరంలో కొంతమందిని బంధించి అక్కడ వదిలేసినట్లు చూపించే షాట్ తో ట్రైలర్ మొదలయ్యింది. ఇక ప్రస్తుత కాలంలో వరుసగా 26 మంది అమ్మాయిల మిస్సింగ్ కేసు అంటూ న్యూస్ రావడంతో కథ మొదలవుతుంది. వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి అతి దారుణంగా హత్యచేసే సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్స్ అయిన అశ్విన్, నందితా ప్రయత్నిస్తూ ఉంటారు. కేవలం రెడ్ డ్రెస్ వేసుకున్నవారినే కిడ్నాపర్ టార్గెట్ చేయడంతో వీరు కొంతమంది అమ్మాయిలకు రెడ్ డ్రెస్ వేసి ఆపరేషన్ మొదలుపెడతారు. అయితే ఆ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడంతో పై అధికారులు ఈ జంటఐ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న అశ్విన్, నందిత.. బాగా రీసెర్చ్ చేసి ఒక నాలుగు కొమ్ముల చెక్క మాస్క్ ను కనిపెడతారు.అసలు ఆ మాస్క్ ఎవరిది..? ఆ మాస్క్ కు హిడింబకు సంబంధం ఏంటి..? బంగాళాఖాతంలో చనిపోయిన ఆ బందీలు ఎవరు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక అశ్విన్ బందీగా, పోలీస్ గా డబుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. నందితాతో లిప్ కిస్, రొమాన్స్ కూడా చూపించి హైప్ పెంచారు. వికాస్ బడిశా సంగీతం గ్రిప్పింగ్ గా ఉంది. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి హిడింబతో అశ్విన్ హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: