టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన రాంగోపాల్ వర్మ ఎప్పుడూ కూడా వివాదాలకు స్థానం కల్పించేలా చేస్తూ ఉంటారు. గతంలో వర్మ చేసిన సినిమాలకు భారీ క్రేజ్ ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అడల్ట్ సినిమాలు, పొలిటికల్ సినిమాలు తీయడంతో నిరంతరం వివాదాస్పదమైన డైరెక్టర్ గా మారిపోయారు. కానీ వర్మ తను చేయాలనుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా భారీ అంచనాల సినిమాలకు సంబంధించి నటీనటుల పైన ఎప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు వర్మ.



అలా ఇప్పుడు తాజాగా వార్ 2 సినిమా టీజర్ విడుదల పైన చేసిన ట్విట్ వైరల్ గా మారుతున్నది. అయితే ఈ ట్విట్ వర్మ అర్ధరాత్రి చేసినట్లుగా కనిపిస్తోంది. వార్ 2 టీజర్ తెలుగు, హిందీ వంటి భాషలలో రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ టీజర్లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ అవుతూ అవుతాయని అందరూ అనుకున్నారు కానీ.. ఇందులో కియారా అద్వానీ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ హీరోయిన్ కి సంబంధించి కొన్ని షాట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


కియారా బికినీ వేయడంతో అది కూడా మొదటిసారి వేయడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వార్ 2 టీజర్ నుంచి కియారా ఒక ఊహించని హైలైట్ గా నిలిచిందని అభిమానులు భావిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయం మీదే ఒక బోల్డ్ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ క్లోజప్ ఫోటోలను షేర్ చేస్తూ కియారా బికినీ ఫోటోలతో బ్యాక్ నుంచి స్టిల్స్ ని షేర్ చేసి మరి కియారా బ్యాక్ ఎవరికి దక్కుతుందో అన్నట్టుగా ట్వీట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వర్మ చేసిన ట్వీట్ ను చాలామంది తిట్టిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: