
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కల్కి సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుందని ఆయన అన్నారు. అయితే అశ్వినీదత్ చెప్పిన విధంగా అంత తక్కువ సమయంలో కల్కి2 షూట్ పూర్తీ కావడం సాధ్యమేనా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్కి సీక్వెల్ ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలస్సి ఉంది.
కల్కి సీక్వెల్ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. కల్కి సీక్వెల్ లో ట్విస్టులు సైతం ఊహించని విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన షూటింగ్ లను పూర్తీ చేయడానికి చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభాస్ మీడియా ముందుకు వస్తే మాత్రమే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి.
ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పారితోషికం 120 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ప్రభాస్ ఎంచుకుంటూ ఇతర హీరోలను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రభాస్ ఈ ఏడాది ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.