
ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. ఆ సినిమాకు పని పట్టుకుని మరీ వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారు వేలల్లో ఉన్నారు. ఈ ప్రచారం చేస్తున్న వారిలో సగానికి పైగా సినిమా చూసి ఉండరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తమ పైశాచికత్వాన్ని.. నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు. కేవలం పవన్ కళ్యాణ్‌పై ఉన్న కోపాన్ని తమ శాడిజం రూపంలో చూపించుకుంటున్నారు. ఓ సినిమాకు పాజిటివ్ ప్రచారం కన్నా.. నెగటివ్ ప్రచారం ఎక్కువ జరగడం కామనే. వీరమల్లు సినిమాపై ముందునుంచి కాస్త అంచనాలు తక్కువగానే ఉన్నాయి. సినిమా బాగా ఆలస్యం కావడం.. దీనికి తోడు దర్శకుడు మారడం.. ఇవన్నీ సినిమాపై అంచనాలు తక్కువుగా ఉండడానికి కారణమయ్యాయి.
ఎప్పుడు అయితే పవన్ ఈ సినిమా ప్రమోషన్ల కోసం రంగంలోకి దిగాడో అప్పటి నుంచే వీరమల్లు సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగింది. సినిమా మరీ ఆహా ఓహో అదిరిపోయింది అన్నట్టుగా లేకపోయినా పర్వాలేదు. ఫస్టాఫ్ ఎక్కడా వంక పెట్టడానికి వీలులేదు. సెకండాఫ్ లో కాస్త సాగదీతతో పాటు సనాతన ధర్మం కాన్సెఫ్ట్ ఎత్తుకోవడంతో కథ ట్రాక్ తప్పినట్టు అయినా క్లైమాక్స్‌లో మళ్లీ ఊపు ఇచ్చారు. విజువల్స్ విషయంలో మాత్రం అందరూ కాస్త నిరాశచెందారు. మామూలుగా సినిమా బాగా లేనప్పుడు అలాంటి ప్రచారం జరుగుతుంది. వీరమల్లు సినిమా ఎలా ఉందన్నది కూడాచూడని వారు.. సినిమా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
సినిమా హిట్ అయితే .. పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా వచ్చే లాభం ఉండదు. కానీ ఆయన సినిమా హిట్ కాకూడదన్నది రాజకీయంగా ఆయన ఎదుగుదల సహించని వారు సోషల్ మీడియా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. చాలా కాలం సెట్స్ మీద ఉన్న సినిమాను.. నిర్మాతకు న్యాయం చేసేందుకు పవన్ చాలా సమయం కేటాయించారు.. పైగా ఎప్పుడూ ప్రమోషన్లు ఇష్టపడని పవన్ ఈ సినిమా కోసం గట్టిగా ప్రమోషన్లు కూడా చేశారు. అయితే సినిమాను ఎలాగైనా ప్లాప్ చేయాలని కంకణం కట్టుకున్న కొందరు సోషల్ మీడియాలో ఈ మూడు రోజుల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా పోస్టులు పెడుతూ.. నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు