సినిమాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కొన్ని చిత్రాలు మాత్రం చాలా కనెక్ట్ అయ్యి కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోతాయి. అలాంటి చిత్రాలలో అతడు చిత్రం కూడా ఒకటి ఈ సినిమాకి డైరెక్టర్ గా త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా హీరోగా మహేష్ బాబు, హీరోయిన్గా త్రిష నటించారు. 2005 ఆగస్టు 10న ఈ సినిమా విడుదల సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి నిర్మాతగా నటుడు మురళీమోహన్ నిర్మించారు. 2025 ఆగస్టు 9వ తేదీ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడు సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ రోజున హైదరాబాదులో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి మురళీమోహన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.


ఈ చిత్రంలో మొదట నటుడు నాజర్ (మూర్తి) పాత్రను పోషించిన పాత్రను మొదట అలనాటి హీరో శోభన్ బాబుతో చేయించాలనుకున్నామని తెలిపారు మురళీమోహన్. అందుకు సంబంధించి ఆయన మేనేజర్ కి కూడా ఒక బ్లాంక్ చెక్కు ఇచ్చి శోభన్ బాబు ఇంటికి పంపించామని.. రెమ్యూనరేషన్ ఎంతైనా పర్వాలేదని చెప్పిన ఆయన అంగీకరించలేదని తెలిపారు. అయితే ఆ పాత్ర శోభన్ బాబు గారు చేయకపోవడానికి కారణాన్ని కూడా తెలియజేశారు.


శోభన్ బాబు ఎప్పుడు ప్రేక్షకులకు హీరోగానే గుర్తుండాలి తాత, తండ్రి పాత్రలలో గుర్తు పెట్టుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారట. ఈ విషయాన్ని తాజాగా మురళీమోహన్ వెల్లడించారు. అతడు సినిమా 2005 కు గాను అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా అలాగే మూడు నంది అవార్డులు, ఉత్తమ డైరెక్టర్ ఫిలింఫేర్ అవార్డు కూడా త్రివిక్రమ్ గెలిచారు. మాటీవీలో అత్యధికంగా ప్రసారమైన సినిమాగా రికార్డ్ సృష్టించింది. శోభన్ బాబు 1996లో సినీ ఇండస్ట్రీ నుంచి దూరంగా రిటైర్డ్ అయ్యారు. చివరిసారిగా శోభన్ బాబు 1992లో విడుదలైన బలరామకృష్ణులు సినిమాలోని నటించారు. ఆ తర్వాత బిజినెస్ వైపుగా దృష్టి పెట్టి ఇండస్ట్రీకి దూరమైన శోభన్ బాబు 2008లో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: