
అయితే ఒక విషయం మాత్రం గమనించదగ్గది. పెళ్లికి ముందు, పెళ్లి సమయంలో అమాయకంగా కనిపించే అమ్మాయిలు విడాకుల తర్వాత మాత్రం చాలా స్ట్రాంగ్‌గా మారిపోతున్నారు. జీవితం ఇచ్చిన అనుభవాలు, ఎదురైన సవాళ్లు వారిని మానసికంగా దృఢంగా తయారు చేస్తున్నాయి. దీనికి స్పష్టమైన ఉదాహరణలుగా సమంత మరియు నిహారిక పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
నిహారిక ఒక సున్నితమైన మనస్కురాలు, అందరితో కలిసిపోయే గుణం కలిగిన అమ్మాయి. కానీ తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యల కారణంగా తన భర్త నుంచి విడిపోయింది. విడాకుల తర్వాత ఆమె ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో కనిపించిన ఆత్మవిశ్వాసం నిజంగా ప్రతి ఆడపిల్లకి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. విడాకుల ముందు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఉన్న ఆ అమాయకత, సైలెన్స్ కంటే విడాకుల తర్వాత ఆమె మాటల్లో ఒక స్పష్టత, ఒక ధైర్యం స్పష్టంగా కనిపించాయి. తన కాళ్ల మీద తాను నిలబడాలి అనే సంకల్పం, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే దృక్పథం ఆమెలో మరింతగా పెరిగింది. అలాగే హీరోయిన్ సమంత కూడా ఇలాగే ఒక ఉదాహరణ. పెళ్లికి ముందు, పెళ్లి సమయంలో ఎంతో అమాయకంగా, సింపుల్‌గా కనిపించిన సమంత, విడాకుల తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయింది. ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా, ఎంత ప్రతికూలత ఎదురైనా హుందాగా, ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూలలో సమంత చూపిస్తున్న ఆ బలమైన ఆత్మవిశ్వాసం నిజంగా అనేక మందికి ప్రేరణగా మారింది.
ఇక సమాజం మొత్తం ఈ విషయంపై ఒకే మాట చెబుతోంది – పెళ్లి ముందు, పెళ్లి తర్వాత అమ్మాయిలు బలహీనంగా కనిపించవచ్చు, కానీ విడాకుల తర్వాత మాత్రం చాలా బలమైన వ్యక్తిత్వంగా మారిపోతారు. కారణం వారు ఎదుర్కొన్న పరిస్థితులు, పొందిన అనుభవాలు. “ఒకసారి తెగించి ముందుకేసిన వాళ్లకు ఇకపై భయమే ఉండదు” అని కూడా చాలామంది అంటున్నారు. మొత్తానికి ఈ కాలంలో విడాకులు అనేది ఓ నెగిటివ్ సింబల్ కాకుండా, జీవితంలో ఒక కొత్త ఆరంభానికి నాంది అని చాలా మంది భావిస్తున్నారు.