మరికొన్ని గంటల్లో ఓజీ సినిమా రిలీజ్ కానుండగా తెలంగాణ హైకోర్టు టికెట్ రేట్ల పెంపు మెమోను సస్పెండ్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణ హైకోర్టు నిర్ణయంతో ఇప్పటికే అమ్మిన టికెట్ల విషయంలో  ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఓజీ మూవీకి క్రేజ్ దక్కడానికి ఈ సినిమా టైటిల్ కూడా ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే.

ఓజీ సినిమా హిట్టైతే  ఇంగ్లిష్ టైటిల్స్ కు క్రేజ్ పెరుగుతుందని చెప్పవచ్చు. ఇంగ్లిష్ లెటర్స్ తో టైటిల్ ను క్రియేట్ చేయడం ద్వారా దర్శకుడు సుజిత్ తనకంటూ ప్రత్యేక మార్కును క్రియేట్ చేశారు. ఓజీ సినిమాకు సంబంధించి  రెండేళ్ల క్రితం విడుదలైన గ్లింప్స్ సినిమాపై  అంచనాలను భారీ స్థాయిలో పెంచేసింది. ఈ సినిమా కథనంలో సైతం ఊహించని ట్విస్టులు ఉండబోతున్నాయని  తెలుస్తోంది.

గతంలో పవన్ కళ్యాణ్ నటించిన బాలు, పంజా సినిమాలను గుర్తు చేసేలా ఓజీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ ఉన్నాయి. అయితే ఆ సినిమాలకు ఈ సినిమాకు పోలిక ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో అకీరా నందన్ కనిపిస్తే మాత్రం కచ్చితంగా ఈ సినిమా రేంజ్  కచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓజీ సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాల్లో ఒకటిగా నిలవనుంది.

ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉన్నాయని తెలుస్తోంది. నిర్మాత దానయ్య ఈ సినిమా మంచి లాభాలను అందిస్తుందని నమ్ముతున్నారు. ఓజీ సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందని పవన్ కెరీర్ లోనే  ఈ సినిమా స్టైలిష్ సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.  పవన్ కళ్యాణ్ కోరుకున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: