కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చే అవకాశం ఉందా...? అంటే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే అవుననే సమాధానం వినబడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నిర్మలా సీతారామన్ పలు కీలక అంశాల గురించి చర్చించే అవకాశం ఉందని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న భారీ అప్పుల గురించి చర్చించవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో స్థోమతకు మించి అప్పులు చేయడంతో ఆర్థిక భారం కేంద్ర ప్రభుత్వంపై కూడా పడుతుందని వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

భవిష్యత్తులో ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండడం అలాగే ప్రజల మీద కూడా మితిమీరిన భారం పడే సూచనలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమవుతుందని ప్రతినెలా కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా చేయడంతో పరిస్థితి దిగజారి పోతోందని కేంద్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి తో కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి భేటీ అయ్యే అవకాశం ఉందని వచ్చే నెల మొదటి వారంలో ఈ భేటీలు జరగొచ్చని సమాచారం.

ప్రతి రోజు కూడా కొన్ని కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ చర్చలు జరుపుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో రోజురోజుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులు ఇచ్చిన వాళ్ల దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా రావడం దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కూడా వాళ్లు ఒత్తిడి ఎక్కువగా చేయడంతో సమస్య మరింత జటిలం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి దీన్ని ముందుగానే పరిష్కరించే ఆలోచనలో నిర్మలా సీతారామన్ ఉన్నారని త్వరలోనే ఆమె ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావచ్చని అంటున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం కూడా వచ్చినట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి నిర్మలా సీతారామన్ ఎప్పుడు వస్తారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: