గత కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలు ఈ రోజుకు ఏడు రోజులు పూర్తి పూర్తయ్యాయి. అయినా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మత్రం ప్రతిరోజు ఆందోళనలు నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా దఫాలుగా  తెలుగుదేశం పార్టీ సభ్యులను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసినదే. అయితే ఈ రోజు ఉదయం  9 గంటలకు ప్రారంభమైన ఏడవ రోజు బడ్జెట్ సమావేశాలలో నిరసన తప్పలేదు. అలాగే సభ జరుగుతున్నపుడు సెల్ఫోన్లు లోపలికి తీసుకురాకూడదు అని, ఫోన్ లకు అనుమతి లేదు అని  స్పష్టం చేశారు తమ్మినేని. అయితే ఆయన ఇచ్చిన రూలింగ్ పై తెలుగుదేశం పార్టీ సభ్యులు  అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సభలో జరుగుతున్నటువంటి  పరిణామాలను సెల్ఫోన్తో  రికార్డు చేసి మీడియాకు టీడీపీ  సభ్యులు  పంపిస్తున్నారు అనే సమాచారం తమకు ఉన్నదని చెప్పారు స్పీకర్ తమ్మినేని.

 అందుకే సభలోకి సెల్ఫోన్లో అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం శాసనసభ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో  ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు  గొడవలు వంటివి జరుగుతున్నప్పుడు  వాటికి సంబంధించిన ఫుటేజీలను బయటకు రాకుండా జాగ్రత్త పడతారు. మరికొన్నిసార్లు వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు. ఈ సందర్భంగా ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఆ మాటలు లైవ్ లోకి వెళ్లకుండా  స్పీకర్ తమ్మినేని ఆ యొక్క మైక్ కట్ చేశారు. కార్యకర్తలకు టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబు మాటలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయడం కోసమే అసెంబ్లీలో సెల్ఫోన్ల పై నిషేధం విధిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. వచ్చే బడ్జెట్ సమావేశాల నుంచి ఈ యొక్క నియమం అమలు అవుతుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: