2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ అఖండ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది. దీనితో వైస్సార్ కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి తరువాత సీఎం అయిన వ్యక్తిగా జగన్ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ జగన్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచిపోయింది. అయితే నేడు రాష్ట్ర పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న ఛందంలో పూర్తిగా అభివృద్ధి ఆగిపోయింది. కేవలం ఎన్నికలలో తాను ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలను మాత్రమే నెరవేర్చుకుంటూ పోతూ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శలు వస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేకపోలేదు. అందుకే ఈసారి చాలా నియోజకవర్గాలలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం రెండవ మంత్రి వర్గ విభజనలో మంత్రి అయిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కు వచ్చే ఎన్నికల్లో కష్టకాలం తప్పదట. కానీ ఎమ్మెల్యే నుడ్ని మంత్రి అయినప్పటీకే నియోజకవర్గంలో ప్రజలలో మంచి పేరు లేదని కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో తన సమీప అభ్యర్థిపై కేవలం 7832 ఓట్లతో విజయం సాధించిన జోగి రమేష్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడా అన్న సందేహం నెలకొంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఇతనిపై పోటీకి టీడీపీ సీనియర్ లీడర్ కాగిత వెంకట్రావు కుమారుడు కాగిత కృష్ణ ప్రసాద్ ను బరిలోకి దింపుతున్నారు. నిజంగా ఇది టీడీపీ నుండి అద్భుతమైన మూవ్ అని చెప్పాలి.  

అయితే నియోజకవర్గంలో ఇతనిపై కృష్ణప్రసాద్ పై తండ్రి చనిపోయాడన్న సానుభూతి వర్క్ అవుట్ అయ్యి రమేష్ కు వ్యతిరేకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే జోగి రమేష్ ఇంకా కష్టపడి మళ్ళీ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకుంటే తప్ప ఓటమి తప్పదట. మరి మంత్రి జోగి రమేష్ రానున్న ఎన్నికలలో  ఏ విధమైన ప్రణాళికలు చేయనున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: