వైయస్ జగన్ మద్యపాన నిషేధం విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక సార్లు మద్యపానం నిషేధం విషయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక గట్టిగానే చర్యలు చేపడుతున్నారు. పైగా ఎన్నికల మేనిఫెస్టోలో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ప్రజా సంకల్ప పాదయాత్ర లో గట్టిగా ఈ విషయంపై ప్రజలకు జగన్ మాట ఇవ్వటంతో, ఆ స్థాయిలోనే ఏపీలో మద్యం దుకాణాలను ప్రభుత్వం నడిపేలా అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ముందుగా గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులు మొత్తం లేకుండా చేయడం జరిగింది. ఆ తర్వాత మద్యం దుకాణాల వద్ద సిట్టింగ్ విధానం లేకుండా గట్టి చర్యలు చేపట్టడం జరిగింది. ఉదయం 10 గంటలనుండి రాత్రి 7 గంటలవరకు మాత్రమే షాపులు తెరవాలని సరికొత్త విధానాలను తీసుకువచ్చి మద్యం షాపులను తగ్గించుకుంటూ జగన్ సర్కార్ రాణించడం జరిగింది.

 

అయితే ఈ లోపు కరోనా వైరస్ రావడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ అమలులో ఉండటంతో దేశవ్యాప్తంగా మద్యం షాపుల అన్ని క్లోజ్ అవ్వటం మనకందరికీ తెలిసినదే. అయితే ఇటీవల మూడు దశ లాక్ డౌన్ పొడిగించిన సమయంలో సడలింపు లో మద్యం షాపులు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం ఆదేశాలు ఇవ్వడం మనకందరికీ తెలిసినదే. దీంతో జగన్ సర్కార్ 40 రోజులు మందు మానేసిన మందుబాబులకు మద్యంపై అసహ్యం కలిగే విధంగా దాదాపు 75% రేట్లు పెంచడం జరిగింది.

 

మొదటి రెండు రోజులు మద్యానికి బానిస ఆదాయం వచ్చినా గానీ మూడోరోజు అమ్మకాల్లో 50 శాతానికి పైగా ఆదాయం పడిపోయింది అంటే జగన్ సరికొత్త ఫార్ములా వల్ల చాలామంది మందుబాబుల కి  మద్యం పై అసహ్యం కలిగే విధంగా చేసిందట. దీంతో జగన్ రేట్లు పెంచడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులు విజిల్స్ మీద విజిల్స్ వేస్తున్నారు. జగన్ మా కుటుంబాలను ఈ విధంగా కాపాడుతున్న అందుకు కృతజ్ఞతలు అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: