కరోనా కల్లోలానికి కళ్ళెం పడే రోజు అతి దగ్గర్లోనే ఉంది.... ప్రపంచాన్నే ఒక కుదుపు కుదిపేసిన కరోనా వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ ఇండియా లో అడుగు పెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ కి వ్యాక్సిన్ చేరుకోగా క్లినికల్ ట్రయల్స్ మొదలు కానున్నాయి. ఈ ట్రయల్స్ విజయవంతమైన వెంటనే వీలైనంత త్వరగా ప్రజలకు అందించనున్నారు అధికారులు. మరి ఆ వ్యాక్సిన్ ఏమిటో ఎక్కడనుండి వచ్చిందో తెలుసుకుందామా. అయితే కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ పై ఓ లుక్కేయండి.

ఇంతకీ ఆ వ్యాక్సిన్ ఏంటంటే....రష్యా ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందరికంటే ముందుగా తయారుచేసిన "స్పుత్నిక్ వి" కరోనా వ్యాక్సిన్. మా వ్యాక్సిన్ ఎంతో సమర్థవంతమైనదని  ఓ వైపు రష్యా బల్ల గుద్ది చెబుతున్నా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు అనుమానాలకు తెరదించుతూ వ్యాక్సిన్ ట్రయల్స్ జరగనున్నాయి. త్వరలోనే మనదేశంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో సంయుక్తంగా రెడ్డి ల్యాబ్స్ ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకోనున్నది. ఇప్పటికే వ్యాక్సిన్ హైదరాబాద్ నగరానికి చేరుకోగా....మనదేశంలో ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వడంతో మూడో దశ ట్రయల్స్ కు సర్వం సిద్ధమైంది.

వీలైనంత తొందరలోనే ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే మరోవైపు రష్యా తమ కరోనా వ్యాక్సిన్ 92 శాతానికి పైగా సమర్థవంతంగా పనిచేస్తుందని ఇప్పటికే తెలియచేసింది.  రష్యా సావరెన్ వెల్త్ ఫండ్ ఆర్డీఐఎఫ్ కూడా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తుందని పేర్కొంది. ఇటీవలే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగగా... అందులో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేసిందని రష్యా పేర్కొంది. అయితే ఇండియాలో మాత్రం క్లినికల్ ట్రయల్స్ జరిగిన అనంతరం మాత్రమే వ్యాక్సిన్ను ప్రజలకు పంపిణీ చేయనున్నారు. మరి గత ఎనిమిది నెలలుగా ఎదురుచూసిన తరుణం కోసం మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: