సాధారణంగా ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్కరికీ కష్టాలు రావడం సహజం. కొంతకాలం తరువాత మళ్ళీ వారికీ మంచి కాలం వస్తుంది. కానీ కొందరికేమో కస్టాలు వరాలు లాగా వస్తూనే ఉంటాయి. నిరంతరం వారి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే అన్ని సమస్యలకు మూలం దానం ఒక్కటే. ఆ సంపద మనకు ఉంటే దాదాపు చాలా సమస్యలను మనము అధిగమించవచ్చు. అయితే ఇలాంటి ఆర్ధిక సమస్యలతో మీరు బాధించబడుతున్నారా...? అయితే బాధపడకండి. కొన్ని వియాలను పాటించడం వలన ఇలాంటి వాటి నుండి మీరు విముక్తి పొందవచ్చు.

కాబట్టి శ్రీ మహాలక్ష్మీని ప్రసన్నం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం కొన్నింటిని తప్పకుండా పాటించాలి. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందితే ఆర్థిక సంబంధిత సమస్యలన్నీ తొలుగుతాయని నమ్ముతారు. చాలా మంది గృహిణులు కావొచ్చు లేదా ఆ ఇంటిలో వారు ఎవరైనా ఆహారాన్ని వృధా చేస్తుంటారు. ఇలా ఆహారాన్ని వృధా చేయడం మూలాన ఆ లక్ష్మి దేవి మీపై ఆగ్రహిస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో లక్ష్మి దేవిని కోపానికి గురి చేయకూడదు. ఒకవేళ లక్ష్మి దేవికి కోపం కలిగితే మీ ఇంట్లో సంపద కరువుతో పాటు సంతోషాన్ని కూడా కోల్పోతారు.

కాబట్టి ఆహారాన్ని వృధా చేయకుండా ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే లక్ష్మీ దేవి ప్రసన్నమవుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఆహారాన్ని వృధా చేయడం మంచిది కాదు. ఎంతోమంది అలాంటి ఆహారం దొరక్క రోడ్లపైన ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికీ ఆ ఆహారాన్ని పంచితే మీకు పుణ్యం వస్తుంది. అలాగే లక్ష్మి దేవి చల్లని దయ మీపై ఉంటుంది. కాబట్టి మీరు ఆ తరువాత సకల సంపదలను మరియు ఎనలేని సంతోషాన్ని మీ కుటుంబంలో కలిగి ఉంటారు. ముఖ్యంగా లక్ష్మి దేవిని శుక్రవారం ఉపవాసం చేసి పూజ చేస్తే మీరు కోరుకున్న కోరికలు తీరుతాయని ప్రతీతి. 

మరింత సమాచారం తెలుసుకోండి: