దేశంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కూడా టెన్షన్ పెడుతోంది. దానికి తోడు వైట్ ఫంగస్ కేసులు కూడా కొన్ని దేశ వ్యాప్తంగా గుర్తించబడ్డాయి. ఇలా కరోనా టెన్షన్ తో పాటు మరో పక్క బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కూడా విజృంభిస్తున్న వేళ మరో కొత్త ఫంగస్ వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో ఎల్లో ఫంగస్ ను గుర్తించినట్లు అక్కడి వైద్య అధికారులు వెల్లడించారు. 


ఇది బ్లాక్ వైట్ ఫంగస్ కంటే ప్రమాదకరమని తెలుస్తోంది. ఈ ఫంగస్ సోకిన వారిలో బరువు తగ్గడం, ఆకలి మందగించడం, లేదా ఆకలి లేకపోవడం అలాగే బద్ధకంగా అనిపించడం లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యులు నిర్ధారించారు. మొత్తం మీద వైరస్ కు తగ్గట్టు ఈ ఫంగస్ కూడా టెన్షన్ పెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: