విశాఖలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె ఎయిర్ పోర్ట్ కొచ్చారని తెలుసుకొని స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్మల సీతారామన్ పర్యటనను అడ్డుకునేందుకు ఎయిర్పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్నారు. కార్మికులు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయకూడదు అంటూ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిర్మల సీతారామన్ పర్యటన పై నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా వారిని అరెస్టు చేశారు.

నిర్మల సీతారామన్ పర్యటన నిమిత్తం ఈరోజు సాయంత్రం విశాఖకు చేరుకున్నారు. ఈ రోజు ఆమె ఎయిర్ పోర్ట్ గెస్ట్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుని రేపు విశాఖలో పర్యటించనున్నారు. రేపు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పొందూరుకు  వెళ్లనున్నారు. అనంతరం అక్కడ మధ్యాహ్నం భోజనాలు ముగించుకుని మూడు గంటలకు విశాఖ పట్నం చేరుకుంటారు. సాయంత్రం విశాఖ పెద వాల్తేరులో వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆదివారం కృష్ణాదేవి పేటలో అల్లూరి ఘాట్ ను సందర్శిస్తారు. ఆదివారం సాయంత్రం తాళ్లపాలెం రేషన్ డిపో సందర్శించి ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి బయలు దేరుతారు. ఈ నేపథ్యంలో ఆమెకు మరితంగా నిరసన సెగ తగిలే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: