గూగుల్ పే వాడే వారికి చక్కటి శుభవార్త. ఇక రూపే క్రెడిట్ కార్డ్స్ ఉన్నవారు కూడా గూగుల్ పే యాప్ నుంచి ఈజీగా యూపీఐ పేమెంట్స్  చేయొచ్చు.ఇక ఇందు కోసం గాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం చేసుకుంది గూగుల్ పే.అలాగే ఈ రూపే క్రెడిట్ కార్డ్ యూజర్లు గూగుల్ పే యాప్‌లో తమ కార్డ్ లింక్ చేసి పేమెంట్స్ అనేవి చేయొచ్చు. అలాగే ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్‌లో గూగుల్ పే ద్వారా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేయొచ్చు. ప్రస్తుతానికి యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇంకా అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఈ ఫీచర్ అనేది అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని బ్యాంకులు ఈ లిస్టులో చేరతాయని గూగుల్ పే  ప్రకటించింది.ఇక ఈ ఫీచర్‌తో గూగుల్ పే వినియోగదారులు క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేయడం చాలా సులువవుతుంది. అంతేగాక రూపే క్రెడిట్ కార్డ్ ఉన్నవారు బ్యాంక్ అకౌంట్ నుంచి కాకుండా క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పేమెంట్స్ చేయొచ్చు.


ఈ విధానం ఇండియాలో డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా స్వీకరించేలా చేస్తుంది. ఈ రూపే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయడానికి కస్టమర్లు ముందుగా క్రెడిట్ కార్డ్‌ని ఖచ్చితంగా యాడ్ చేయాల్సి ఉంటుంది.ముందుగా గూగుల్ పే యూజర్లు యాప్ ని ఓపెన్ చేయాలి.ఆ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాడ్ రూపే క్రెడిట్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. తరువాత మీరు క్రెడిట్ కార్డ్ చివరి ఆరు అంకెలు, గడువు తేదీ ఇంకా పిన్ ని ఎంటర్ చేయాలి. ఇక కార్డ్ ని యాక్టివేట్ చేసిన తర్వాత RuPay credit card on UPI ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. ఇక ఆ తర్వాత రూపే క్రెడిట్ కార్డ్‌ని జారీ చేసిన బ్యాంకును కూడా సెలెక్ట్ చేయాలి.ఆ తరువాత ఇప్పుడు ప్రత్యేకమైన UPI పిన్‌ని సెట్ చేయాలి.ఇక ఆ తర్వాత, మీరు ఇప్పుడు వ్యాపారుల దగ్గర రూపే క్రెడిట్ కార్డ్‌తో ఈజీగా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.ఇంకా అంతేగాక కస్టమర్లు యూపీఐలో క్రెడిట్ కార్డ్ లింక్ చేయడానికి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన పని లేదు.ఈ యూపీఐ యాప్‌లో క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఒక రోజులో రూ.1,00,000 దాకా పేమెంట్స్ చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: