నేటి ఆధునిక సమాజంలో మహిళలకు రక్షణ లేనట్టేనా.. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఇదే ప్రశ్న తలెత్తుతోంది. ఈ సృష్టికి మూలమైన ఆడపిల్ల నేడు దుర్భర జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు కామంతో కళ్లు మూసుకుపోతున్న మానవ మృగాలు కనుచూపు మేరలో ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. అంతటితో ఆగకుండా ఏకంగా ఆడపిల్లల ప్రాణాలను తోడేస్తున్న వారు ఎంతోమంది.


 ఇంకొంతమంది మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ అనే ముసుగు వేసుకుని.. నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ వెంట పడటం..  ఇక ఆ తర్వాత శారీరక అవసరాలు తీర్చుకుని నడిరోడ్డు మీద వదిలేయటం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.  ఇంకొంతమంది మంచి వాళ్ళం అనే ముసుగులో పరిచయం పెంచుకొని చివరికి సమయం కోసం ఎదురు చూసి ఆ తర్వాత వారి నిజస్వరూపం బయట పెడుతూ ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగర శివార్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాజేంద్ర నగర్ కు చెందిన ఓ యువతికి వాట్సాప్ ద్వారా ఒక యువకుడు దగ్గరయ్యాడు. ఇక ఆ తర్వాత న్యూడ్ చాటింగ్ కు తెరతీశాడు. ఇక అతని మాయలో పడి పోయిన యువతి నగ్నంగా అతని తో చాటింగ్ చేయడం మొదలు పెట్టింది. అయితే ఆ చాటింగ్ మొత్తం సేవ్ చేసుకొని చివరికి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు ఆ యువకుడు. బలవంతంగా ఫ్రెండ్ రూమ్ కి పిలిచి యువతిపై అత్యాచారం చేశాడు. ఇక రోజు రోజుకూ అతని వేధింపులు ఎక్కువ కావడంతో పరిస్థితి భరించలేకపోయిన  యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా నిందితుని అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: