సాధారణంగా జనాలు ఖాకి చొక్కాకు ఇచ్చే గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఖాకి చొక్కా ధరించిన పోలీసులు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇక నేరాలను అరికట్టడంలో.. సభ్య సమాజంలో శాంతిభద్రతలు నెలకొల్పడానికి ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటారు. ఇక సభ్య సమాజంలో అందరం ఇక సంతోషంగా ఎలాంటి టెన్షన్ లేకుండా బ్రతక గలుగుతున్నాం అంటే దానికి కారణం పోలీసులు అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి ఉన్నారు అనే ఒక భరోసా అని చెప్పాలి. అందుకే ఇక పోలీసులకు ప్రజలు అమితంగా గౌరవించడం లాంటివి చేస్తూ ఉంటారు.


 కానీ ఇటీవల కాలంలో కొంతమంది పోలీసు అధికారులు మాత్రం ఖాకి చుక్కకే మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులతో ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. చెన్నై లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక సెంబియ్యం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది ఒక మహిళ. ప్రతి బాధితురాలు మొబైల్ నెంబర్ తీసుకున్న కానిస్టేబుల్  ఇక ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు.


 అయితే మహిళ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సమయంలో విధుల్లో ఫస్ట్ గ్రేడ్ కానిస్టేబుల్ వినోద్ కుమార్ ఉన్నాడు. అయితే ఆ మహిళతో మాటలు కలిపి ఇక ఆమె మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. తర్వాత మహిళతో మొబైల్ చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. అయితే ఓ రోజు ఈ విషయం మహిళా భర్తకు తెలిసింది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలంటూ సదరు వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటన కాస్త సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ ఘటనపై సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఈశ్వరన్ స్పందిస్తూ కానిస్టేబుల్ వినోద్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: