అమరావతి అమరావతి బాబుజనుల మాహిష్మతి!! కులదూలకు పరాకాష్ట ఈ నూతన సింగపురి !!

అమరావతి అమరావతి బాబు జనుల మాహిష్మతి

కులదూలకు పరాకాష్ట ఈ నూతన సింగపురి (సింగపూర్) !!

ఆంధ్రజనుల కలలపంట ఈ అమరావతి నగరమంట

సీమజనుల గ్రహచారమంట ఈ అధునాతన సింగపురి !!

నిరుపేదల పొట్టకొట్టి సంపన్నుల జేబునింపు యమగిరి ఈ అమరపురి

ప్రజాస్వామ్య పతనానికి సాక్ష్యమిచ్చే చరిత్రగతి ఈ మాహిష్మతి !!

తరతరాల అంతరాల ప్రాంత వర్గ భేదానికి రూపవతి ఈ ఇంద్రపురి

కాలగమనపర్వంలో సీమజనుల క్రోదానికి ఆజ్యమిచ్చు ఆతిద్యపురి !!

జనాగ్రహ జ్వాలల పధక రచనాపథం కదిలే విచిత్రపురి అమరావతి

ప్రకృతి పులకింతలేని ప్రయత్నమే ఈ అమరపురి !!

కృష్ణవేణి సృజించనున్న దుర్గతల్లి ముక్కుపుడక ప్రజ్వరిల్లె తరుణమిది

నరహంతక తత్త్వంతో చిరుజీవుల ఉనికి లేని హననపురి ఈ నారాపురి !!

ఫిబ్రవరి 2016 లో ఇండియా హెరాల్డ్ వెబ్-సైట్ లో నా తొలి గేయరచనగా ప్రచురించ బడింది "అమరావతి భ్రమరావతి" అనే పేరుతొ. దానినే మరోసారి ఈ ఆర్టికల్ ను పొందు పరిచాను. అమరావతి రాజధాని నిర్మాణాన్ని దాని వెనుక ఉన్న సామాజిక వర్గ ఆధిక్యత రాజకీయం, వ్యాపారం, ఆధిపత్యం తప్ప సామాన్యుల మనసులను ఉనికిని సైతం పరిగణన లోకి తీసుకోలేదు. ఒక వ్యక్తి తన లక్ష్య సాధన కోసం నిర్మించబోతూ, ముందుగా చూపిన గ్రాఫిక్ దృశ్య కావ్యం. విదేశాలకు ఇక్కడ మన రాజధానిపేరుతొ అమూల్యమైన భూమిని సంతర్పణచేసి - అక్కడ విదేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యం నిర్మించు కోవటానికో - ఒకవేళ ఇప్పటికే ఉంటె దాన్ని విస్తరించు కోవటానికో అయి ఉంటుందని అంటున్నారు. 

అది ప్రజల కలల రాజధాని అయివుంటే ఎవరు ఆ నగరాన్ని గాన్ని, ఆ ఆలోచనను గాని ఏనాటికి చంపేయ లేక పోయేవారు.


నాడు రాజధానిగా అమరావతి నిర్మాణంలో ప్రకృతి పులకింత లేదు. జన సామాన్యంలో ధృడమైన కోరికలేడు. కొందరి సంపద కాంక్షతప్ప. అందుకే ఆ ఆలోచన కాలపరిణామం లో కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ప్రజాభిప్రాయం స్థానిక ఎన్నికల్లో ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. ఏపీలోని మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ విజయం అద్భుతం అనితరసాధ్యం. 71 మున్సిపాలిటీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ ఊపు తగ్గలేదని మరోసారి రుజువు అయ్యింది. ప్రజాభిప్రాయం ఎవరు ఔనన్నా కాదన్నా గాలి కూడా చోరలేనంత నిండుగా వ్యక్తమైంది.


రాజధాని వికేంద్రీకరణకు ఓట్లు పడ్డాయి - అదీ చంద్రబాబు కోరుకున్న విధంగా రెఫరెండం - అదే ప్రజాభిప్రాయం వ్యక్తమైంది.

అమరావతిని కాదని, పరిపాలనను వికేంద్రీకరిస్తూ మూడు రాజధాను లంటూ సీఎం ప్రకటించడం, దానిని ప్రజలు తమ అభిప్రాయం చేస్తూ - అమరావతి పరిధి లోని విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో టీడీపీ గెలుస్తుందని అంతా అనుకున్నవేళ - ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని చాటి చెప్పాలని చంద్రబాబు బాగానే ప్రచారం చేశారు.

కానీ ఈ రెండింటినీ వైసీపీ గెలుచుకొని “రాజధానిగా అమరావతి పై అభిమతంతో కూడిన అంగీకారం (సెంటిమెంట్) లేదని” రుజువు చేసుకుంది. దీన్నిబట్టి మూడు రాజధానులకు అమరావతి జన అంగీకారం లభించినట్లే, చంద్రబాబు వాదనకు బలం లేదని అర్ధమైంది

అమరావతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా సంవత్సరంన్నరపైగా జరుగుతున్న ఆందోళనలు ఎవరో పోగేసుకున్న సంపద పరిరక్షణకు - దాని చుట్టూ నిర్మించ తల పెట్టిన సామ్రాజ్య పరిరక్షణ ప్రాకారానికి ఆది లోనే జనాభిప్రాయం ద్వారా పురిట్లోనే సంధి కొట్టింది.

అక్కడి రైతులు ఇప్పటి వరకు నడిపింది పెయిడ్ ఉద్యమంగా నడిచినట్లే భావించాలి. చంద్రబాబుకు ఈ ఫలితాలు గట్టి షాకిచ్చాయనే చెప్పొచ్చు. చంద్రబాబు సైతం ప్రజా తీర్పును అంగీకరించి “మూడు రాజధానులకు జై కొట్టాలన్న డిమాండ్” కు మరింత బలం ఇచ్చినట్టు ఫలితాలు నిరూపించాయి.

గుంటూరులో వైసీపీ గెలిస్తే అమరావతిని ఎక్కడికైనా మార్చుకోవచ్చంటూ చంద్రబాబు చేసిన ప్రకటన ఇప్పుడు అధికారపక్షం లేవనెత్తుతోంది. చంద్రబాబు నిరసనలకు స్వస్తి చెప్పి మూడు రాజధానులకు అంగీకారం పలకాలనే అమరావతి ప్రాంత ప్రజలతో సహా అశేషాన్ద్రజనం కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: