ప్రపంచం ముందు శాంతికామకుణ్ణి అనిపించుకోవడానికి నాటకాలాడుతున్నాడు చైనా అధ్యక్షుడు జింపింగ్. ఎందుకంటే చైనా విషయంలో ప్రపంచం వ్యతిరేకతతో ఉంది. రష్యాకు ఆయుధాలు ఇచ్చే దేశంగా, భారత్ లోని భూమిని ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నే దేశంగా దానిమీద అభిప్రాయం ఉంది. అట్లానే జపాన్ లో రచ్చ చేసేటి దేశంగా చైనా పైన కోపంగా ఉంది. ఆస్ట్రేలియాని కెలికే దేశం గా కూడా పేరుంది. అట్లాగే సముద్ర జలాలను మింగేసే దేశంగా దానిపైన కోపం కూడా ఉంది.


కాబట్టి దాన్ని కవర్ చేసుకొని మేము కరెక్ట్ గానే ఉన్నామని చెప్పుకోవడం కోసం ఒకపక్క గాల్వన్ లోయ, తవాంగ్ అంతకుముందు డోక్లాం లోయ దగ్గర అరాచకం చేయడానికి చూసి భారత్ ఆపడం వల్ల ఆగి, 3 సంవత్సరాలుగా తన సైన్యాన్ని సరిహద్దులు దగ్గర మోహరించి, భారత్ చేత కూడా అంతే సంఖ్యలో సైనికులను మోహరిస్తే అప్పుడు ఏళ్ల తరబడి పోషించడం కష్టం. కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న భారతదేశం తన సైన్యాన్ని సరిహద్దుల వద్ద పోషించడం కష్టమైపోతుంది.


అప్పుడు పాకిస్తాన్ లాగా చేతులు కట్టుకుంటుందని భావించింది చైనా. అప్పుడు తాను ఆక్రమించుకుందామనుకుంటుంది.  భారతదేశంలో ప్రజలపై ఎక్కువ పన్నులు వేసి, ఈ డబ్బులు  పట్టుకుని వెళ్లి  సైన్యాన్ని సరిహద్దులో రక్షణ కోసం ఖర్చు పెట్టి, దాదాపు 60వేల మంది నుండి లక్షన్నర మంది సైన్యాన్ని సరిహద్దు ప్రాంతంలో మోహరించుకుని కూర్చుంది భారత్. చర్చలు జరుపుదామంటూ ఎప్పటికప్పుడు నాటకాలాడే చైనా మెన్ టు మెన్ మీటింగ్ లకు ముందుకు వచ్చింది.


ఇప్పుడు భారతదేశం జీ ట్వంటీ కి, అలాగే ఎస్సిఓ కి కూడా అధ్యక్షత వహిస్తుంది. కాబట్టి ఈ ఏడాదిలో ఏకంగా రెండుసార్లు చైనా అధ్యక్షుడు భారతదేశానికి రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు ఈ పాయింట్ ని మీడియా మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ అడుగుతాయి‌. కాబట్టి చర్చలని నాటకాలు ఆడటం కోసం చైనా చేస్తున్న ఎత్తును భారతదేశం గ్రహించి లైట్ తీసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: