
చైనాకు తక్కువ ధరకు ఇచ్చి భారత్ కు రష్యా ధరలు పెంచడంపై మేధావులు మండి పడుతున్నారు. గతంలో 15 డాలర్లు, 20 డాలర్లు ఉన్న క్రూడాయిల్ బ్యారెల్ ధరను ప్రస్తుతం 25 డాలర్లు, 30 డాలర్లకు పైగా పెంచేసింది. ఎవరూ కూడా కొనని సమయంలో ధైర్యం చేసి భారత్ కొంటే ఇప్పుడు చైనా కొనుగోలు చేస్తుందని ధర పెంచడం సబబు కాదని దౌత్యవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సౌదీ అరేబియా నుంచి అత్యధికంగా ఆయిల్ ను కొనే చైనా, ప్రస్తుతం రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ ను కొనుగోలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల రష్యా, చైనా మధ్య బంధం మరింత బలపడుతోంది. భారత్ గతంలో ఇరాన్ నుంచి అత్యధికంగా క్రూడాయిల్ కొనుగోలు చేసేది. రష్యా, ఉక్రెయిన్ యుద్దం అనంతరం రష్యా నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించారు. అది అత్యంత కఠినమైన నిర్ణయం. ప్రపంచ దేశాలు వద్దని వారిస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికే మొగ్గు చూపింది. అలాంటి ఇండియాకు ధర పెంచడం, చైనాకు ధర తగ్గించి ఇవ్వడం సరైనది కాదని విమర్శలు వస్తున్నాయి.