భారత సైనికుల మీద మెరుపుదాడి చేసి అయిదుగురు  జవాన్లను పూంచ్ జిల్లాలో పొట్టన పెట్టుకున్నారు.  మళ్లీ దాడి చేసిన సమయంలో మరో అయిదుగురు సైనికులు చనిపోయారు. ఈ దాడులు చేసింది పాసిస్ట్ ప్రంట్ అనే సంస్థ చేసినట్లు తెలుస్తోంది. ఇది లష్కరే తోయిబాకు చెందిన సంస్థే కానీ ఈ కొత్త పేరును పెట్టుకుని మళ్లీ దాడులకు దిగుతోంది.


అయితే ఈ పేరు పెట్టుకోవడానికి కారణం ఒకటి ఉంది. లష్కరే తోయిబా అని పెడితే ప్రపంచ దేశాల నుంచి గతంలో వచ్చిన వ్యతిరేకత వస్తుందని గ్రహించి పేరు మార్చుకుని దాడులకు తెగబడుతోంది. అయితే రెండో సారి దాడి జరిగిన సమయంలో ఇండియా సైనికులు వీర పోరాటం చేశారని ఈ పాసిస్టు ప్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కానీ మా ముందు వారు నిలవలేకపోయారని చెప్పకనే చెప్పింది.


అంటే భారత ఆర్మీ కంటే బలమైన ఆర్మీ అని నిరూపించాలని ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అసలు ఈ దాడులకు మూలం ఎవరనే విషయాలను ప్రస్తుతం భారత ఆర్మీ జల్లెడ పడుతోంది. దీనికి సంబంధించి ఎక్కడ ప్రణాళికలు వేశారు. ఎవరు అమలు చేశారు. సైన్యం పై దాడి చేయడానికి వీరు ఉపయోగించిన మందు గుండు సామగ్రి ఎక్కడ నుంచి వచ్చింది. ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు విచారణలో తేలనున్నాయి.


ఎవరూ దాడి చేశారనే అంశాన్ని కూడా ఇండియన్ ఆర్మీ తీవ్రంగా తీసుకుంది. కానీ పాసిస్టు తీవ్రవాద సంస్థ దాడి చేసింది మేమే అని ప్రకటించడం, ఆర్మీ అధికారులు పోరాడారని చెప్పడం.. ఇక్కడ అనుమానించాల్సిన విషయం. వీరు ఇండియన్ ఆర్మీ ని తక్కువ చేసి చూపుతున్నారా అంటే ఒక రకంగా అలాంటిదే చేస్తున్నారు. కానీ సైన్యానికి ఒక్క క్లూ చాలు వారి పని పట్టడానికి.. ఎవరు చేయిస్తున్నారు. ఎక్కడి నుంచి ఈ దాడులకు ఆపరేటివ్ చేస్తున్నారనే విషయాలను భారత ఆర్మీ జల్లెడ పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: