మీరు ఏనాడైనా కాని మీ కుటుంబంతో లేదా మీ స్నేహితులతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు..మీ జేబులో ఉంచుకున్న మీ ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్లు అనిపించి ఉలిక్కిపడి వెంటనే దాన్ని తీసి చూడటం జరిగిందా.ఇక అలా చూసిన తరువాత మీకు ఏవిధమైన మెసేజ్ కానీ.. లేదా కాల్ కానీ రాకపోవడం జరిగి ఉంటుంది. ఈ అనుభవం చాలా మందికి కూడా ఎదురై ఉంటుంది. ఇలాంటి ఒక ఆకస్మిక అనుభూతి అనేది ‘ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్’ కావచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు.ఇక ఈ సమస్య అనేది నిరంతరం కూడా పెరుగుతోంది. ఎందుకంటే మొబైల్ వినియోగం గ్రాఫ్ అనేది ప్రతిరోజూ కూడా బాగా పెరుగుతోంది.ఇక ప్రతి 10 మంది మొబైల్ వినియోగదారుల్లో 9 మంది వినియోగదారులు తమ మొబైల్ రింగవుతున్నట్లు భ్రమ పడినట్లు ఒక నివేదికలో వెలుగులోకి వచ్చిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్.. ఫిలాసఫర్ రాబర్ట్ రోసెన్‌బెర్గర్ ఇదే ‘లెర్న్డ్ బాడీలీ హ్యాబిట్స్’ అని అభిప్రాయపడటం జరిగింది.ఇక ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. మెదడులో రీ-వైరింగ్ అనేది ఉంటుంది. ఒక వ్యక్తి తన ఫోన్‌ను పదేపదే ఉపయోగిస్తుంటే లేదా వాడుతుంటే .. ఫోన్ ను ఎప్పుడూ కూడా వైబ్రేషన్ మోడ్‌లో ఉంచినట్లయితే, అతను ఇప్పటికీ అలాంటి ప్రమాదకరమైన సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్‌పై ఎక్కువ డిపెండెన్సీ ఉండటం వల్ల ఇలా జరుగుతుందట. ఇది రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతున్న ఓ మానసిక స్థితి. ఇక ఈ సమస్య అనేది చాలామంది ప్రజలలో కూడా సంభవిస్తుంది.కాబట్టి ఫోన్ వైబ్రేషన్ లో పెట్టకండి. అలాగే అవసరం వున్నప్పుడు మాత్రమే ఫోన్ వాడండి.. ఎప్పుడూ కూడా అసలు ఫోన్ వాడకూడదు. ఒకవేళ వాడిన కాని వైబ్రేషన్ లో మాత్రం అస్సలు పెట్టకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: