చాలా మందికి కోపం, అసహనం, చిరాకు ఎక్కువగా ఉంటాయి. వాటిని కొన్ని ఆహారాలు తినడం ద్వారా పోగొట్టవచ్చు.మీ మూడ్ ను మార్చి మనస్సు ప్రశాంతత చేకూర్చే ఆహారాలను తీసుకోవటం అవసరం. డార్క్ చాక్లెట్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలాగా ఉపయోపడతాయి. వీటిని తింటే మూడ్ ఆటోమెటిక్ గా ఛేంజ్ అవుతుంది. ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తినండి. ఇది మిమ్మల్ని రీఫ్రెష్ గా చేస్తుంది. డార్క్ చాక్లెట్ లో ఉండే సమ్మేళనాలు డోపమైన్ ను పెంచేందుకు సహాయపడతాయి. దీంతో మీరు మరింత హ్యీపీ మూడ్ లో కి మారిపోతారు.ఓట్స్ బరవును తగ్గించేందుకు ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్ ను తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు ఓట్స్ మధుమేహులకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. ఓట్స్ లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని శక్తివంతంగా చేస్తుంది. హ్యాపీ మూడ్ లోకి మారిపోతారు.బీన్స్, కాయధాన్యాల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి.


వీటిలో వివిధ రకాల విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని శక్తివంతంగా చేయడంతో పాటుగా ఉత్సాహంగా ఉంచుతాయి.అరటిపండ్లు  మన ఆరోగ్యానికి చాలా అవసరం. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ బి6, చక్కెర, ఖనిజాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. ఈ పండ్ల మిమ్మల్ని రీఫ్రెష్ గా చేస్తాయి. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.ఇంకా అలాగే నట్స్ లో ఎన్నో పోషకాలుంటాయి. రోజూ గుప్పెడు గింజలను తింటే శరీరంలో విటమిన్ల లోపం పోతుంది. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. మూడ్ బాగాలేనప్పుడు కొన్ని గింజలను నమలడం వల్ల హ్యాపీ మూడ్ లోకి మారిపోతారు. ఇవి డిప్రెషన్ ను కూడా తగ్గిస్తాయి. నైట్ షిఫ్ట్ లో పని చేసేవారు మధ్యమధ్యలో వీటిని తింటే ఆరోగ్యం బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: