ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం అనేది చాలా ముఖ్యమైనది ఇటీవల కాలంలో చాలా మంది ప్రజలు 30 సంవత్సరాలు పైబడగానే ముసలి వాళ్ళ లాగా అనారోగ్య సమస్యలతో శతమాతమవుతూ తమ సంతోషమైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. సాధారణంగా ఇలా చిన్నవయసులోనే జబ్బుల బారిన పడడానికి కారణం పలు రకాల ఆహారపు అలవాట్లను మానుకోవడమే. తప్పుడు ఆహారపు అలవాట్లు.. తప్పుడు జీవనశైలి.. పోషకాహార లోపం వల్ల చిన్న వయసులోనే రోగనిరోధక శక్తి బలహీనపడి.. కీళ్లనొప్పులు, గుండె జబ్బులు, ఎముకలు బలహీన పడటం లాంటి సమస్యలు వస్తున్నాయి. వృద్ధాప్యంలో కూడా మీరు యంగ్ గా ఫిట్గా కనిపించాలి అంటే మీ ఆహారంలో ఈ నాలుగు పదార్థాలు తప్పకుండా చేర్చుకోవాల్సిందే.

సోయాబీన్స్.. సోయాబీన్స్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి.. జీర్ణ క్రియ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి సోయాబీన్ చాలా చక్కగా పనిచేస్తుంది.  ఇందులో ఉండే పోషకాలు మీ ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయపడతాయి.  100 గ్రాముల సోయాబీన్లో 36.5 గ్రాముల ప్రోటీన్ కూడా మీకు లభిస్తుంది. ప్రోటీన్ లోపం ఉన్నవారు ఇలా సోయాబీన్ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది.

బ్రోకోలి.. ఆరోగ్యాన్ని రెట్టింపు చేయడంలో బ్రోకోలి చాలా చక్కగా పనిచేస్తుంది.  ఇందులో విటమిన్లు , మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.  బ్రోకోలి ప్రోటీన్ లోపాన్ని కూడా పూరిస్తుంది . ఇందులో 4.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.  కాబట్టి ఎముకలు కూడా బలపడతాయి. రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులతో పోరాడే తక్షణ శక్తి మీకు లభిస్తుంది.

పచ్చి బఠానీలు.. ఆకుకూరల్లో ఉండే మినరల్స్ ఐరన్ ప్రోటీన్స్ ఈ పచ్చి బఠానీలలో కూడా ఉన్నాయి ఐదు గ్రాముల ప్రోటీన్ మీకు బఠానీలలో లభిస్తుంది . అలాగే మెగ్నీషియం,  జింక్,  కాల్షియం, పొటాషియం, కాపర్, ఫాస్ఫరస్ మొదలైన వాటిలోపాన్ని కూడా తీరుస్తాయి.  కాబట్టి పచ్చి బఠానీలు అధికంగా తింటే ఫైబర్ కూడా లభిస్తుంది.

చేపలు.. మీరు మాంసాహారులైతే చేపలు ఎక్కువగా తినడం వల్ల ప్రోటీన్ లభిస్తుంది. 100 గ్రాముల చేపలు మీకు 22 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి శరీరానికి అవసరమైన హార్మోన్లను అందిస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్థాలు తీసుకోవాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి: