చాలా మంది అరికాళ్లు, అరి చేతుల్లో మంటలు, తిమ్మిర్లు ఇంకా అలాగే కండరాలు పట్టుకుపోవడం లాంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. పెద్ద వారిలోనే కాకుండా మిడిల్ ఏజ్ వాళ్లలో కూడా మనం ఈ సమస్యను గమనించవచ్చు. ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం రక్తనాళాలు బలహీనంగా మారడమే. రక్తనాళాలు బలహీనంగా మారిన చోట రక్తసరఫరా అనేది తగ్గుతుంది.రక్తసరఫరా తగ్గడం వల్ల వెంటనే ఆ ప్రదేశంలో తిమ్మిర్లు రావడం, సూదితో గుచ్చినట్టు ఉండడం ఇంకా పట్టేసినట్టు ఉండడం జరుగుతుంది.ఇలాంటి సమస్యలతో బాధపడే వారు ఒక చక్కటి ఆయుర్వేద టిప్ ని వాడటం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వారు పాలతో గసగసాలను కలిపి తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. పాలల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. పాలను తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య లాభాలు కలుగుతాయి. క్యాల్షియం లోపం తలెత్తకుండా చేయడంలో, ఎముకలను ధృడంగా మార్చడంలో, మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో, శరీరాన్ని బలంగా ఇంకా ధృడంగా మార్చడంలో ఇలా చాలా రకాలుగా పాలు మనకు సహాయపడతాయి. అలాగే గసగసాల్లో ఒమెగా 3, ఒమెగా 6, క్యాల్షియం, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం వంటి చాలా పోషకాలు ఉంటాయి.


గసగసాలను తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది.ఇంకా అలాగే గసగసాలను తీసుకోవడం వల్ల నిద్రలేమి, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, తిమ్మిర్లు ఇంకా అలాగే వాపులు వంటి సమస్యలు చాలా సులభంగా తగ్గుతాయి. గసగసాల పాలను తీసుకోవడం వల్ల మతిమరుపు, రక్తపోటు ఇంకా అలాగే శరీరంలో బలహీనత వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి.ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలు, ఒక టీ స్పూన్ గసగసాలు వేసి పాలను వేడి చేసి ఈ పాలను ఒక పొంగు వచ్చే దాకా మరిగించిన తరువాత ఇందులో రుచి కోసం ఒక టీ స్పూన్ పటిక బెల్లం పొడిని వేయాలి. అయితే పంచదారను మాత్రం ఉపయోగించకూడదు.అలాగే ఈ పాలను మరో నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక ఇలా తయారు చేసుకున్న పాలను పడుకోవడానికి అర గంట ముందు తాగి నిద్రపోవాలి. ఇలా ఈ పాలను తాగడం వల్ల కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, నరాలల్లో వాపులు, అరికాళ్లల్లో మంటలు ఇంకా తిమ్మిర్లు వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. అలాగే ఎముకలు, నరాలు కూడా చాలా బలంగా తయారవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: