గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో డిసెంబ‌ర్ 27వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు..

1911: జనగణమనను మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.
2012; తిరుపతిలో నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా ప్రారంభమైనవి నేటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అధ్యక్షతన జరిగినవి

ప్ర‌ముఖుల జననాలు..

1571: జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (మ.1630)ఇతడు గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు, జ్యోతిష్య శాస్త్రవేత్త. 17వ శతాబ్దం జరిగిన ఖగోళశాస్త్ర ప్రభంజనంలో కీలక పాత్ర పోషించాడు. ఇతన్ని కెప్లర్ గ్రహగమన సిద్ధాంతం ద్వారా అందరూ గుర్తిస్తారు. ఇతన్ని గ్రహాల పరిభ్రమణంతోపాటు, ఈయన ప్రతిపాదించిన వివిధ సిద్ధాంతాలు 17 శతాబ్దంలో విప్లవాన్ని సృష్టించాయనే చెప్పవచ్చు.
1822: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (మ.1895) వ్యాధులకు కారణం సూక్ష్మక్రిములని కనుగొని రోగ నివారణకు పాశ్చర్ బాటలు వేశారు. టీకాల ఆవిష్కారానికి ఇతడు ఆద్యుడు. మొదటిసారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు.
చాలా మందికి ఇతడు పాలు ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తిగా సుపరిచితులు. ఈ పద్ధతిని నేడు పాశ్చరైజేషన్ అంటారు.ఇతన్ని సూక్షజీవశాస్త్రం వ్యవస్థాపకులైన ముగ్గురిలో ఒకరుగా పేర్కొంటారు; మిగిలిన ఇద్దరు రాబర్ట్ కోచ్, ఫెర్డినాండ్ కాన్.ఇతని మరణం తరువాత పారిస్ లోని పాశ్చర్ సంస్థ భూగర్భంలో పాతిపెట్టారు. ఈ ఘనత దక్కిన 300 మంది ఫాన్స్ దేశస్తులలో ఇతడొకడు.
1934: లారిసా లాటినినా, సోవియట్ జిమ్నాస్ట్. ఒలింపిక్ క్రీడలలో 18 పతకాలను సాధించింది.
1953: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్.

ప్ర‌ముఖుల  మరణాలు

1933: కాకర్ల శ్రీరాములు, మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి.
1998: ధూళిపూడి ఆంజనేయులు, సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత, సంపాదకులు.
2007: బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (జ.1953)

మరింత సమాచారం తెలుసుకోండి: