
2022 - 2023 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు దేశంలోని పలు ప్రధాన పట్టణాల అభివృద్ధి కోసం కేంద్రం రూ.4,761 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటివరకు 2022 - 2023 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.293.75 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద నిధులు విడుదల చేసింది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు 331.40 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. మొత్తంగా మిలియన్ ప్లస్ అర్బన్ సిటీలకు గ్రాంట్ లు అందించడానికి నాలుగు రాష్ట్రాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.1764 కోట్లు విడుదల చేసింది . మొత్తం సొమ్ములో ఆంధ్రప్రదేశ్ కి 136 కోట్ల రూపాయలు, చత్తీస్గడ్ కు 109 కోట్ల రూపాయలు, మహారాష్ట్రకు 799 కోట్ల రూపాయలు, చివరిగా ఉత్తరప్రదేశ్ కు 720 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.
ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ , విశాఖపట్నం, చత్తీస్గడ్ లోని దుర్గ్ భిలాయి నగర్ మరియు రాయ్ పూర్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, గ్రేటర్ ముంబై , నాగపూర్, నాసిక్ , పూణే మరియు వసాయి - విరార్ సిటీలకు గ్రాండ్ విడుదల చేయబడింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, ఘజియాబాద్ , అలహాబాద్ , కాన్పూర్లకు నిధులు మంజూరు చేయబడింది. ఇక ఈ జాబితాలో లక్నో, వారణాసి కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాలకే ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.