హైదరాబాద్  అంటే ఎప్పుడూ సందడి వాతావరణం ఉంటుంది..ఇక్కడ వచ్చేవారు..పోయే వారిలో రోడ్లపై రద్దీగా ఉంటుంది. ఇక కొన్ని సెంటర్లు ముఖ్యంగా చార్మినార్, కోటీ, సికింద్రాదా ఫుట్ పాత్ లపై అమ్మకాలు జోరుగా ఉంటారు. ఇక్కడ అన్ని రేట్లు చీఫ్ గా ఉంటాయి..ముఖ్యంగా బట్టలు అయితే విరివిగా దొరుకుతాయి..దీంతో పేదవారు, విద్యార్థులు, పళ్లెటూర్ల నుంచి వచ్చే వారు ఇక్కడ బట్టలు, బూట్లు రక రకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. చార్మినార్ వద్ద రద్దీగా ఉంది..అక్కడ జనాలు బాగా గుమికూడారు..ఇంతకీ అక్కడ జరుగుతుంది ఏంటా అనుకుంటున్నారు.
Image result for Freaky Ali stills
ఓ వ్యక్తి డ్రాయర్లు అమ్ముతున్నాడు..అయితే రోజూ కామన్ గా చాలా మంది ఫుట్ పాత్ పై అలా అమ్ముతుంటారు..దాంట్లో ప్రత్యేకత ఏముందా అనుకుంటున్నారా..! అవును ప్రత్యేకత ఉందండీ.. ఆ డ్రాయర్లు అమ్ముతుంది ఎవరో కాదు ఆ మద్య సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ మూవి భజరంగీ భాయ్ జాన్ లో రిపోర్టర్ గా నటించిన బాలీవుడ్ నటుడు..నవాజుద్దీన్ సిద్దికి.
Image result for Freaky Ali stills
తాజాగా సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వం వహించిన '' ఫ్రీకీ అలీ '' సినిమాలో నటించాడు . ఆ చిత్ర ప్రమోషన్ నిమిత్తం చార్మినార్ దగ్గర డ్రాయర్లు అమ్మాడు. ఇక ఈ చిత్రంలో సిద్దికీ ఫుట్ పాత్ పై డ్రాయర్లు అమ్మూతూ తిరిగేవాడు..అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి  గోల్ఫ్ క్రీడాకారుడి గా మారతాడు అది ఎలా సాధ్యమైంది అన్నదే చిత్ర కథ . సెప్టెంబర్ 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: