మెగాస్టార్ చిరంజీవి నటుడిగా మాత్రమే కాకుండా మనిషిగా తన బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నాడు. ఆపద వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ వారి ప్రాణాలను రక్షిస్తూ ఎంతోమంది దేవుడు గా మారిపోయాడు. అలా చిరంజీవి గొప్పతనాన్ని ఓ సందర్భంలో నటుడు రాజారవీంద్ర చెప్పాడు. ఆయన మెగాస్టార్ చిరంజీవికి ఎంతటి అభిమానో అందరికీ తెలిసిందే. ముక్కుసూటి తనంతో ఎలాంటి విషయాన్నైనా మొహమాటం లేకుండా చెప్పే రవీంద్ర చిరంజీవి తీసుకునే నిర్ణయాలు చేసే సేవ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు.

 అందుకే రాజారవీంద్ర ఇండస్ట్రీలో ఎక్కువగా చిరంజీవితోనే కనిపిస్తూ ఉంటారు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎంతో ప్రత్యేకమైనది. అన్నయ్య అంటూ పిలుస్తూ సొంత తమ్ముడి లా ఆయన తో మెలుగుతూ ఉండే వారిలో రాజారవీంద్ర కూడా ఒకరు. ఇటీవలే ఆయన ముఖ్య పాత్ర చేసిన ఒక సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో చిరంజీవి గొప్పతనం వివరించాడు. చిరంజీవి చేసే కార్యక్రమాలు గురించి ఎంత చెప్పినా తక్కువే ఏం మాట్లాడినా సరిపోదు కరోనా సమయంలో ఒక్క క్షణం కూడా ఆయన ఖాళీగా లేకుండా ప్రజలకోసం పనిచేశారు అన్నారు. 

అందరికీ వ్యాక్సినేషన్ చేయించారు. అంతేకాదు ఇతర సామాజిక సేవలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. అని ఆయన చెప్పారు. ఇక బ్లడ్ బ్యాంకు గురించి కొన్న
 కీలక విషయాలు చెప్పారు. ఓసారి నటి హేమకు డెలివరీ సమయంలో రక్తం కావాల్సి వచ్చినప్పుడు ఓ నెగటివ్ బ్లడ్ రేర్ గా ఉంటుంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్లే ఆమె బతికింది. ఆరోజు అక్కడ బ్లడ్ దొరికింది. లేకపోతే పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉండేది. అలా బ్లడ్ విలువ అవసరంలో ఉన్న వారికే తెలుస్తుంది బ్లడ్ బ్యాంక్ అంటే అంత సులువేమీ కాదు దానికి ఖర్చు సంగతి పక్కన పెడితే సేవా గుణం ఉండాలి అది చిరంజీవికి వందరెట్లు ఉంది అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: