
మొదట్లో కేజీఎఫ్ సినిమా విడుదలయ్యాక.. పెద్దగా క్రేజ్ రాలేదు. థియేటర్లలో విడుదలైనా కొద్ది రోజుల వరకు సినిమాపై ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కానీ ప్రేక్షకులు ఆదరించిన అభిమానం అంతా ఇంతా కాదు. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో అమాంతం సినిమా రేంజ్ పెరిగింది. మొదటి పార్టే పాన్ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో కేజీఎఫ్-2 సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
అయితే కరోనా కారణంగా సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన కొద్ది రోజులకే సెన్సేషన్ రికార్డు సృష్టించింది. కేవలం ఏడు రోజుల్లోనే ఏడు వందల కోట్లు కొల్లగొట్టింది. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని 19 ఏళ్ల ఉజ్వల్ కులకర్ణి అనే యువకుడి పేరు మార్మోగింది. ఈ యువకుడు ఎవరో కాదు.. కేజీఎఫ్-2 సినిమా సోలో ఎడిటర్. చిన్న చిన్న వీడియోలు, యూట్యూబ్ వీడియోలు ఎడిట్ చేసే కులకర్ణికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బిగ్గేస్ట్ ఆఫర్ ఇచ్చారు. దీంతో అతని పేరు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మార్మోగుతోంది.
తాజాగా ప్రశాంత్ తదుపరి చిత్రం సలార్‌లో కూడా తానే ఎడిటర్‌గా పనిచేయనున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సలార్’ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. కులకర్ణి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్-2 సినిమాలో చూపించిన ప్రతిభనే కనబరిస్తే కులకర్ణి భవిష్యత్ ఒక్కసారిగా మారిపోతుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు.