
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో సుమన్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో నటన పరంగా చూస్తే తనకు సూపర్ స్టార్ కమల్ హాసన్ అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. అయితే డ్యాన్స్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఏంతో ఇష్టమని తెలిపారు. చిరంజీవి ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని దేశానికి పరిచయం చేసిన వారిలో చిరంజీవి కూడా ఉన్నారన్నారు. ఇండస్ట్రీ వైపు ఎవరూ చిన్న చూపు చూడకుండా చూసే సత్తా మెగాస్టార్‌కు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ లో క్రేజ్ ఉంటుందని, సాంగ్ లిరిక్స్ ను చూసి ఆ రిథమ్‌కు తగ్గట్లుగా డ్యాన్స్ చేస్తారని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ హీరోలు కొనసాగుతున్నా.. వారికీ పోటీగా సినిమాలు, డ్యాన్సులు చేయడం ఎంతో అద్భుతం అన్నారు. చిరంజీవి డ్యాన్సులో తనకు జిమ్నాస్టిక్ కనిపిస్తుందని సుమన్ తెలిపారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సు కూడా తనకు ఎంతో ఇష్టమన్నారు. ఎన్టీఆర్ కూడా ఒక రిథమ్ ప్రకారం డ్యాన్స్ చేస్తాడని ఆయన పేర్కొన్నారు. వీరిద్దరిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నేళ్ల తర్వాత స్టార్ హీరోలపై పాజిటివ్ మాటలు మాట్లాడటంపై ఆంతర్యం ఏమిటని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.