‘సోనూసూద్’.. మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి తన వంతుగా ఆర్థిక సాయం చేశాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 16 నెలల చిన్నారి విహాన్ స్పైనల్ ముస్కలర్ ఆత్రోపి.. అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ చిన్నారి ఆ వ్యాధి నుంచి బయటపడాలంటే రెండు నెలల్లో రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అంత ఖరీదైన ఇంజెక్షన్‌తో తమ చిన్నారిని కాపాడుకునే స్థామత తల్లిదండ్రులకు లేదు. దీంతో రూ.16 కోట్ల విరాళాన్ని సేకరించేందుకు ప్రయత్నించడం ప్రారంభించారు.

సన్నిహితులు, స్నేహితులు, దాతల ద్వారా విరాళం సేకరించడం ప్రారంభించారు ఆ బాబు తల్లిదండ్రులు డాక్టర్ విక్రాంత్, మీనాక్షి అకుల్వార్. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతూ విరాళం కోసం ప్రాధేయపడ్డారు. దీంతో పలువురు ఆర్థికసాయానికి ముందడుగు వేశారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అభిషేక్ బచ్చన్, మనోజ్ బాజ్పాయ్ వంటి ప్రముఖులు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అలాగే సోనూసూద్ కూడా తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పటివరకు రూ.4 కోట్ల విరాళం సేకరించగా.. అందులో ఎక్కువ భాగం సోనూసూద్‌దే ఉన్నట్లు సమాచారం.

ఈ మేరకు సోనూసూద్ ఆస్పత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించాడు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి.. సోనూసూద్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విహన్‌ను బతికించుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలి. ఆపన్నహస్తం అందించడంలో నాగ్‌పూర్ ఎల్లప్పుడూ ముందుండాలి. అందరికీ ఆదర్శంగా నిలబడాలి. ఇప్పటివరకు రూ.4 కోట్లు సేకరించాం. ఇంజెక్షన్‌కు రూ.16 కోట్లు ఖర్చు అవుతుంది.. మిగిలిన డబ్బు సేకరించేందుకు దాతలు ముందుకు రావాలి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు అందజేసి.. లక్ష్యాన్ని చేరుకునే చేయాలి. చిన్నారికి స్పైనల్ మస్కులర్ ఆత్రోపి వ్యాధి ఉందని, ఈ వ్యాధి ద్వారా వెన్నెముక కండరాలు క్షీణిస్తాయని పేర్కొన్నారు. ఈ ఇంజెక్షన్ అమెరికా నుంచి తీసుకు రావాలి.’ అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సాయం చేసి.. చిన్నారి ప్రాణాలు కాపాడాలని సోనూసూద్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: