ప్రభాస్‌కి 'బాహుబలి'తో హిందీ జనాల్లో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఈ బ్లాక్‌బస్టర్‌తో బడా స్టార్‌గా ఎదిగాడు. దీంతో ఆటోమెటిక్‌గానే 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసిన 'సాహో' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సుజిత్ దర్శకత్వంలో వచ్చిన 'సాహో' ఆ అంచనాలని అందుకోలేకపోయింది. పైగా ప్రభాస్‌ ఇమేజ్‌ని హ్యాండిల్ చేయలేకపోయాడనే విమర్శలొచ్చాయి. ఇక ఈ ఫ్లాపు తర్వాత సుజిత్ మరో సినిమా స్టార్ట్ చేయలేదు.

'జిల్'తో యావరేజ్‌ రెస్పాన్స్‌ తెచ్చుకున్న రాధాక్రిష్ణ కుమార్ ఆ తర్వాత ప్రభాస్‌తో 'రాధేశ్యామ్' సినిమా తీశాడు. వింటేజ్‌ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌ని అస్సలు మెప్పించలేకపోయింది. సెకండ్‌ డే నుంచే కలెక్షన్లు పడిపోయాయి. ఫస్ట్‌ వీకెండ్‌కే డిజాస్టర్‌ లిస్ట్‌లో చేరిపోయింది. అంతేకాదు రాధాక్రిష్ణ కుమార్‌పైనా విమర్శలొచ్చాయి.

రాహుల్ రవీంద్రన్‌ యాక్టర్‌ నుంచి డైరెక్టర్‌గా మారి 'చిలసౌ' సినిమా తీశాడు. ఈ మూవీకి రెస్పాన్స్ చూసి నాగార్జున ఆఫర్ ఇచ్చాడు. ఇద్దరి కాంబినేషన్‌లో 'మన్మథుడు2' వచ్చింది. అయితే ఈ సినిమా జనాలని అస్సలు ఆకట్టుకోలేదు. పైగా నాగార్జున డబుల్ మీనింగ్‌ డైలాగులు చెప్పడం బూమరాంగ్ అయింది. రాహుల్‌ ఒక సీనియర్ హీరోతో ఇలాంటి సినిమానా తీసేది అని విమర్శించారు. ఆ తర్వాత రాహుల్‌ మరో మూవీ డైరెక్ట్ చేయలేదు.

స్టార్ హీరోస్‌తో సినిమాలు చేస్తే డైరెక్టర్లు కూడా ఫుల్‌ ఎక్స్‌పోజ్ అవుతారు. ఆడియన్స్‌లో భారీ క్రేజ్ వస్తుంది. రెమ్యూనరేషన్లు పెరుగుతాయి. అయితే టాప్ హీరోల సినిమాలు హిట్ అయితేనే ఆ దర్శకులు స్పీడ్‌గా స్టార్లు అయిపోతారు. వాళ్లతో ఫ్లాప్‌ తీస్తే మాత్రం మళ్లీ స్ట్రగుల్స్‌ స్టార్ట్ అవుతాయి.

వక్కంతం వంశీ రైటర్‌ నుంచి డైరెక్టర్‌గా మారి అల్లు అర్జున్‌తో 'నా పేరు సూర్య' సినిమా తీశాడు. సాంగ్స్‌తో మంచి బజ్‌ క్రియేట్‌ చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం బోల్తాపడింది. అల్లు అర్జున్ కంప్లీట్‌ మేకోవర్‌ అయి, ఫిజికల్‌గా బోల్డంత ఎఫర్ట్ పెట్టినా జనాలని థియేటర్లకి తీసుకురాలేకపోయింది. ఇక ఈ ఫ్లాప్‌ తర్వాత వంశీకి నాలుగేళ్లు గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు నితిన్‌తో ఒక సినిమా చేస్తున్నాడు.

'పవర్‌' సినిమాతో రైటర్‌ నుంచి డైరెక్టర్‌గా మారిన కె.ఎస్.రవీంద్ర ఫస్ట్‌ మూవీతోనే మాస్‌ని మెప్పించాడు. దీంతో టాప్ హీరోల నుంచి అవకాశాలు అందుకున్నాడు. పవన్‌ కళ్యాణ్‌తో 'సర్దార్‌ గబ్బర్ సింగ్' తీశాడు. అయితే ఈ మూవీలో పవన్‌ ఇంట్రెస్ట్‌ ఎక్కువై 'సర్దార్' ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత జూ.ఎన్టీఆర్‌తో తీసిన 'జైలవకుశ'తో పెద్దగా మార్క్‌ చూపించలేకపోయాడు. తారక్‌ ట్రిపుల్‌రోల్‌తో ఏదో ఆడిందిగాని లేకపోతే అంతేసంగతులు అనే కామెంట్స్ వినిపించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: