టాలీవుడ్ ఇండస్ట్రీ యంగ్ హీరోలలో ఒకరు అయినా కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ అబ్బవరం ఇప్పటికే రాజావారు రాణి గారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. 

ఆ తర్వాత కిరణ్ అబ్బవరం 'సబాస్టియన్' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన సబాస్టియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇది ఇలా ఉంటే  కిరణ్ అబ్బవరం తాజాగా సమ్మతమే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా,  గోపీనాథ్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. యూజీ ప్రొడక్షన్స్  వారు ఈ సినిమాను నిర్మించగా, శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. చిత్ర బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు  అలా మంచి అంచనాల నడుమ పోయిన నెల అనగా జూన్ 24 వ తేదీన సమ్మతమే మూవీ థియేటర్ లలో విడుదల అయ్యింది.  

విడుదల అయిన మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా పర్వాలేదు అనే రేంజ్ లోనే కలెక్షన్లు వసూలు చేసింది. ఇలా థియేటర్లలో ప్రేక్షకులను బాగానే అలరించిన సమ్మతమే సినిమా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  జులై 15 వ తేదీ నుండి సమ్మతమే మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఎవరైనా ఈ సినిమా థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే జూలై 15 వ తేదీ నుండి ఆహా 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: