
హోంబలె ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ప్రభాస్ ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్ర చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా ప్రస్తుతం దాని యొక్క గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్చ్ వర్క్ జరుగుతోంది. కృతి సనన్ సీతగా నటిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. వీటితో పాటు సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కె కూడా చేస్తున్నారు ప్రభాస్. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.
అయితే మ్యాటర్ లోకి వెళితే వీటిలో ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుండగా సలార్ మూవీ వచ్చే ఏడాది పక్కాగా సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ రెండు మూవీస్ యొక్క రిలీజ్ కి సంబంధించి ఆయా యూనిట్స్ పక్కాగా రెడీ అవుతున్నాయట. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది బాక్సాఫిస్ బరిలో ప్రభాస్ వి రెండు మూవీస్ నిలవడం, అలానే ఆయన ఫ్యాన్స్ ఈ రెండు సినిమాలతో పండుగ చేసుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ రెండు సినిమాలపై మంచి హైప్ ఉండడంతో, ఒకవేళ రెండూ కూడా సక్సెస్ కొడితే హీరోగా ప్రభాస్ క్రేజ్ మరింతగా దూసుకెళ్లడం ఖాయం అనే చెప్పాలి.