
సాధారణంగా సినిమా హీరోలకి అభిమానులు చాలామంది ఉంటారని తెలుసు. అయితే ఒక్కొక్కరు వారి అభిమానాన్ని ఒక్కోలా చూపిస్తారు కొంతమంది ఆ అభిమానం పిచ్చిలా , వెర్రిలా చూపిస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు. మరికొంతమంది తమ హీరోల కోసం వారి సినిమాల కోసం ఏం చేయడానికి అయినా సరే సిద్ధంగా ఉంటారు . ఈ క్రమంలోనే తాజాగా షారుక్ అభిమాని షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారింది. షారుక్ ఖాన్ దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈయన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే.. విలన్ గా జాన్ అబ్రహం ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సేల్ అవుతున్నాయి. తాజాగా రియాన్ అనే ఒక షారుక్ అభిమాని .. ఒక వీడియో పోస్ట్ చేసి.. దానిని సోషల్ మీడియాలో వదిలాడు.. ఆ వీడియోలు నేను షారుక్ కి వీరాభిమానిని.. ఐ లవ్ షారుక్ .. నేను పఠాన్ రిలీజ్ రోజే జనవరి 25న సినిమా చూడాలని అనుకుంటున్నాను..షారుక్ ను కలవాలి కానీ సినిమా టికెట్ కొనడానికి నా దగ్గర మనీ లేదు.
ప్లీజ్ నాకు ఎవరైనా సహాయం చేయండి.. పఠాన్ మూవీ టికెట్ ఇప్పించండి. మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి. లేకపోతే అదే రోజు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటాను అని అనడంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.. టికెట్ కొనడానికి డబ్బులు లేవు కానీ స్మార్ట్ ఫోన్ మెయింటైన్ చేయడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అంటూ కూడా ఆ యువకుడి పై విమర్శలు గుప్పిస్తున్నారు.