రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది పునర్నవి. దాని అనంతరం పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకి పెద్ద గుర్తింపు రాకపోవడంతో బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది. అనంతరం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన కీ అంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ రియాలిటీ షో ద్వారా ఈమెకి ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. అంతేకాదు ఇక ఈ షోలో తన తోటి కంటెస్టెంట్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె చేసిన హంగామా తో మరింత క్రేజ్ ని తెచ్చుకుంది. అంతేకాదు ఆ షోలో తన ఆటతో ఎంతో మంది అభిమానులను అలరించింది ఈమె. 

ఈ షోలో రాహుల్ సిప్లిగంజ్ మరియు పునర్నవి చాలా క్లోజ్ గా ఉండేవారు.దీంతో చాలామంది వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని చాలామంది భావించారు. అనంతరం బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత చాలాకాలం వీరిద్దరూ కలిసి తిరిగారు. ప్రస్తుతం పునర్నవి లండన్ లో ఉంటుంది. అయితే ఇది వరకే తన నెక్స్ట్ స్టెప్ కోసం లండన్కు వెళుతున్నాను అంటూ చెప్పింది. అయితే తాజాగా తన బేబీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది పునర్నవి.ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఆ ఫోటోని చూసి నేటిజన్లో పునర్నవి తల్లి కాబోతుందా అంటూ షాక్ అవుతున్నారు. 

అయితే తాజాగా పునర్నవి షేర్ చేసిన పోస్ట్ లో తన బేబీ బంప్ చాలా క్షుణ్ణంగా కనిపిస్తోంది. దీంతో ఆమె నిజంగానే తల్లి కాబోతోంది అని అందరూ ఫిక్స్ అయ్యారుమ్ ఇదిలా ఉంటే ఇక గత కొంతకాలంగా పునర్నవి తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉన్న సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ కూడా అయింది. అయితే ఈ క్రమంలోనే తన బేబీ ఫోటోని షేర్ చేయడంతో తను నిజంగానే తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉంది అన్న వార్తలు నిజమని తెలుస్తోంది. ఇక పునర్నవి నిజంగా తల్లి కాబోతుందో లేదో తెలియదు గాని..ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. పునర్నవి నిజంగా తల్లి కాబోతుందా లేదా అన్న విషయం తెలియాలి అంటే తన షేర్ చేసిన బేబీ పంపు ఫోటో పై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: