
అయితే ఇప్పుడైతే వరుస హిట్లను చూస్తున్నాడు. కానీ గత కొంతకాలం క్రితం వరకు మాత్రం బాలకృష్ణ వరుస ప్లాపులతో సతమతమయ్యాడు అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు అయితే బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ గా నిలిచాయి.. దీంతో బాలకృష్ణతో సినిమా చేయడానికి ఎంతో మంది దర్శక నిర్మాతలు కూడా వెనకాడారు అని చెప్పాలి. కానీ ఇప్పుడు మళ్లీ సూపర్ హిట్ సాధిస్తూ ఉండడంతో బాలకృష్ణ డేట్స్ కోసం అదే దర్శకులు వేచి చూస్తూ ఉన్నారు. అయితే బోయపాటితో సింహ అనే సినిమా చేయడానికి ముందు ఏఎస్ రవికుమార్ చౌదరి తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారట బాలయ్య.
కానీ ఈ అవకాశాన్ని మాత్రం రవికుమార్ సరిగ్గా వినియోగించుకోలేదట. తరచూ స్క్రిప్టు మారుస్తూ ఇక పూర్తయిన షూటింగ్ని కూడా రిటెక్ చేయడం లాంటివి చేసేవాడట. అంతేకాదు కొన్ని కొన్ని సార్లు షూటింగ్ సెట్ కి తాగి రావడం లాంటి తప్పు పనులు చేశారట. అయితే బాలయ్య తన ముందు ఎవరైనా ఇలా తప్పు చేశారు అంటే నిర్మొహమాటంగా ఆగ్రహానికి గురవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక కె ఎస్ రవికుమార్ రోజు సెట్ కి తాగి వస్తున్నారు అన్న విషయం బాలయ్యకు తెలిసింది. డైరెక్టర్ కావడంతో ముందుగా కేవలం హెచ్చరికతోనే సరిపెట్టుకున్నాడు బాలయ్య. అయినప్పటికీ అతని తీరులో మార్పు రాకపోవడంతో ఇక బాలయ్య ఏకంగా డైరెక్టర్ పై చేయి కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని నిర్మాత అంబికా కృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.